ఇక్కడా విజయ్ పార్టీ విస్తరణ, టార్గెట్ ఫిక్స్ - రంగంలోకి స్ట్రాటజిస్టులు..!!
తమిళనాడుతో ఆగేది లేదు. అంతకు మంచి. పొరుగు రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరించాలి. ఇదే లక్ష్యం తో ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఇందు కోసం ఫ్యాన్స్ కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రాధమిక చర్చలు సాగుతున్నాయి. స్ట్రాటజిస్టులు రంగంలోకి దిగుతున్నారు. తమిళనాడులో పార్టీని మరింత గా బలోపేతం చేస్తూనే... ప్రభుత్వంలో తన మార్క్ చూపించాలని విజయ్ భావిస్తున్నారు. ఇదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరణ దిశగా కీలక కార్యాచరణ మొదలైంది.
తమిళనాడులో అనూహ్యంగా అధికారం దక్కించుకున్న విజయ్ పార్టీ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందు కోసం కసరత్తు మొదలైంది. ప్రాధమికంగా బలం.. అవకాశాల పైన క్షేత్ర స్థాయి లో పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. తమిళనాడుకే పరిమితం కాకూడదని విజయ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా పొరుగున ఉన్న కేరళంలో రాజకీయ విస్తరణకు పావులు కదుపుతోంది. తాజా కేరళంలోని విజయ్ అభిమానులు పలువురు పాలక్కాడ్‌లో సమావేశమయ్యారు. గత వారంలోనూ విజయ్ ఫ్యాన్స్ కొందరు కేరళంలో టీవీకే విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు వయనాడ్‌లో ప్రయత్నాలు ప్రారంభించారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ 2024లో పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయన అభిమానులు కేరళలో పార్టీ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో పార్టీ అనూహ్యంగా 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా నిలవడంతో ఆ ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి.

దశల వారీగా విస్తరణ
తాజాగా కేరళలో 'విజయ్ మక్కల్ ఇయక్కం' బ్యానర్ కింద ఆయనకు వేలాది మంది అభిమానులు ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం సందర్భంగా కేరళలోని పలు చోట్ల విజయ్ అభిమానులు సంబరాలు సైతం జరుపుకున్నారు. తాజాగా జరిగిన అభిమానులు పాలక్కాడ్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది యువతీయువకులే కావడం, పలువురు ఐటీ నిపుణులు సైతం ఉండటం విశేషం. 'మై టీవీకే' యాప్ ద్వారా ఇప్పటికే సభ్యత్వ నమోదు కూడా వీరు వేగంగా జరుపుతున్నట్టు చెబుతున్నారు. కేరళలో బూత్ లెవెల్ నుంచి పార్టీ కార్యక్రమాలను విస్తరించాలని, తమిళనాడులో మార్పునకు శ్రీకారం చుట్టిన టీవీకేకు కేరళ ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అభిప్రాయం వ్యక్తంచేశారు. టీవీకే నాయకత్వం అన్ని జిల్లాల్లోనూ కార్యకలాపాలను సమన్వయం చేయడం వల్ల పార్టీ బలోపేతమవుతుందని చెబుతున్నారు. దీంతో.. రంగంలోకి దిగిన విజయ్ స్ట్రాటజిస్టులు పూర్తి అధ్యయనం తరువాత అవరమైన కార్యాచరణకు సిద్దం అవుతున్నారు.













Click it and Unblock the Notifications