నేను చెప్పాను కాబట్టే ఒప్పుకున్నారు! పిచ్చి యుద్ధాన్ని ఆపాలి

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఎడతెగకుండా సాగుతున్న సుదీర్ఘ పోరుపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలనే ఆరాటం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లోనే ఎక్కువగా కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి రష్యా దాడులు చేస్తోందంటూ కేవ్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

నెలలోనే 32 వేల మంది బలి.. పిచ్చి యుద్ధాన్ని ఆపాలి!

మిడ్‌టర్మ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓహియో వెళ్లేందుకు సిద్ధమైన ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ యుద్ధంలో నెలకు ఏకంగా 32,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది అత్యంత విచారకరమైన, అనవసరమైన "పిచ్చి యుద్ధం" అని అభివర్ణించారు. ఇరుదేశాల అధినేతలు వెంటనే ఒకచోట కూర్చుని ఈ ఘర్షణకు చరమగీతం పాడాలని తేల్చిచెప్పారు. ఇరువైపులా ఉల్లంఘనలు జరుగుతున్నట్లు కథనాలు వస్తున్నాయని, వాటిపై తాను పూర్తి వివరాలు తెలుసుకుంటానని ట్రంప్ పేర్కొన్నారు.

Trump Claims Putin Wants Ukraine Peace More Than Zelenskyy and Defends Russian Diesel Supplies

నేను చెప్పాను కాబట్టే ఒప్పుకున్నారు!

కాల్పుల విరమణకు ఇరుదేశాలు అధికారికంగా స్పందించలేదన్న విలేకరుల ప్రశ్నకు ట్రంప్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "వాళ్లు ఒప్పందానికి అంగీకరించారు.. ఎందుకో తెలుసా? నేను ఒప్పందానికి రమ్మని చెప్పాను కాబట్టి!" అని వ్యాఖ్యానించారు. ఇద్దరు నేతలకు శాంతి ఒప్పందం చేసుకోవాలనే ఉంది కానీ, అది ఎలా చేయాలో అర్థం కావడం లేదని, తానే వారిద్దరినీ ఒకే వేదికపైకి తెచ్చి ఒప్పందం కుదిరేలా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

రష్యా శరణు కోరిన ట్రంప్... రూల్స్ పక్కనపెట్టి ఆయిల్ అడుక్కున్న అధ్యక్షుడు
రష్యా శరణు కోరిన ట్రంప్... రూల్స్ పక్కనపెట్టి ఆయిల్ అడుక్కున్న అధ్యక్షుడు

రష్యా డీజిల్‌పై ట్రంప్ సమర్థన.. రిపబ్లికన్ల విమర్శలకు కౌంటర్

రష్యా నుంచి డీజిల్ సరఫరాలను అనుమతించడంపై సొంత పార్టీ రిపబ్లికన్ల నుంచి వ్యక్తమవుతున్న విమర్శలను ట్రంప్ తోసిపుచ్చారు. ప్రపంచ ఇంధన మార్కెట్లో స్థిరత్వం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రష్యా నుంచి లక్షలాది టన్నుల డీజిల్ సరఫరా కానుందని, దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌కు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. అమెరికాలోని రైతులు, పశుపోషకులకు ప్రయోజనం చేకూరే ప్రతి నిర్ణయానికి తాను మద్దతు ఇస్తానని పేర్కొంటూ, జెలెన్స్కీ అనవసర విమర్శలు మాని శాంతి చర్చలపై దృష్టి పెట్టాలని సూచించారు.

40 ఏళ్ల నాటి నిషేధం ఎత్తివేత.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం!
40 ఏళ్ల నాటి నిషేధం ఎత్తివేత.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం!

ట్రంప్ ప్రకటన వేళ రష్యా భయానక దాడులు.. జెలెన్స్కీ ఆవేదన

మరోవైపు అమెరికా అధినేత వ్యాఖ్యలపై ఉక్రెయిన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా ప్రతిపాదించిన ఇంధన కాల్పుల విరమణకు కట్టుబడి తాము రష్యా ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేస్తే, రష్యా మాత్రం నివాస ప్రాంతాలపై డ్రోన్ దాడులకు తెగబడిందని జెలెన్స్కీ ఆరోపించారు. కీవ్‌లోని ఒక బహుళ అంతస్తుల భవనంపై రష్యా డ్రోన్ దాడి చేయడంతో ఇద్దరు పౌరులు మరణించారని, తొమ్మిది మంది గాయపడ్డారని వెల్లడించారు. ట్రంప్ శాంతి ప్రతిపాదనలకు పుతిన్ ఇస్తున్న సమాధానం ఇదేనని, రష్యా దౌర్జన్యాలకు స్వస్తి పలకాలంటే అంతర్జాతీయ సమాజం మరింత గట్టి ఒత్తిడి తీసుకురావాలని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+