డిసెంబర్ నుండి ఈ 6 రాశుల వారికి గురుశక్తి అనుగ్రహం..ఈ రాశులవారికి లగ్జరీ లైఫ్!
2026 డిసెంబర్ 13 నుంచి గురు గ్రహం సింహ రాశిలో వక్రగతి ప్రారంభం కానుంది. ఈ వక్రగతి సుమారు నాలుగు నెలల పాటు కొనసాగి 2027 ఏప్రిల్ 13న మళ్లీ మార్గగతికి మారుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువు జ్ఞానం, అదృష్టం, ధనం, విద్య, వివాహం, పురోగతికి కారకుడు. ఈ వక్రగతి సమయంలో కొన్ని రాశులకు పాత అవకాశాలు మళ్లీ వస్తాయి. కెరీర్లో పురోగతి, ఆర్థిక లాభాలు కనిపిస్తాయి.
సింహ రాశి:
గురు వక్రగతి సింహ రాశి వారికి చాలా అనుకూలం. సింహరాశి జాతకులకు గతంలో చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి, కొత్త బాధ్యతలు, ముఖ్యమైన ప్రాజెక్టులు రావచ్చు. వ్యాపారస్తులకు పాత కస్టమర్ల నుంచి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది.

మేష రాశి:
మేషరాశి జాతకులకు పాత ప్రణాళికలను మళ్లీ సమీక్షించే అవకాశం వస్తుంది. ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్నవారు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారంలో పాత కస్టమర్లతో సంబంధాలు పునరుద్ధరించుకుంటే లాభం. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపాటు మానుకోండి.
మిథున రాశి:
మిథున రాశి జాతకులు కొత్త ఆలోచనలు అమలు చేసే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలతో పురోగతి సాధించవచ్చు. పాత అవకాశాలు మళ్లీ వస్తే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారం విస్తరణకు మంచి సమయం.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి జాతకులు ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలు చూస్తారు. పాత పెట్టుబడులు, బాకీలు పరిష్కారం కావచ్చు. ఉద్యోగంలో మెరుగైన ప్రదర్శనతో గుర్తింపు వస్తుంది. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో సమతుల్యత పాటించండి.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి జాతకులకు గత ప్రయత్నాల ఫలితాలు కనిపించవచ్చు. కెరీర్లో స్థిరత్వం, ఆర్థిక లాభాలు వస్తాయి. పాత సంబంధాలు మళ్లీ బలపడతాయి. ఈ సమయం వీరికి అన్ని విధాలా కలిసి వచ్చే సమయం.
ధనుస్సు రాశి:
గురు గ్రహ సంచారం సమయంలో ధనుస్సు రాశి వారికి వృత్తి, ఆర్థిక విషయాలను పునఃపరిశీలించుకునే అవకాశం లభించవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు తమ గత కృషికి గుర్తింపు పొందే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి సరైన సమయం.
అయితే కొన్ని రాశులవారు గురు వక్రగతి సమయంలో తొందరపాటు నిర్ణయాలు మానుకోవడం మంచిది. పాత పనులు పూర్తి చేయడం, ఆర్ధికంగా ప్లానింగ్ చేయడం లాభదాయకం. సింహం సహా ఈ ఆరు రాశులవారికి అదృష్ట ద్వారాలు తెరుచుకునే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
