Negligence: ఆధార్ కార్డు లేదని సాకుతో ? తల్లి, కవల పిల్లలు ప్రాణాలు పోయాయి, ప్రభుత్వ ఆసుపత్రిలో !

బెంగళూరు/తుమకూరు: పురిటి నొప్పులు రావడంతో నిండు గర్బిణి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లింది. ఆధార్ కార్డు, గర్బవతులకు ప్రభుత్వం ఇచ్చే తల్లి కార్డు లేదని సాకుపెట్టుకున్న ఆసుపత్రి సిబ్బంది ఆమెకు చికిత్స చెయ్యడానికి నిరాకరించారు. మీరు వేరే ఆసుపత్రిలో చికిత్స చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. నా దగ్గర డబ్బులు లేవని, నా భర్త నాలుగు నెలల క్రితమే చనిపోయాడని, దయచేసి ఇక్కడే తనకు చికిత్స అందించాలని నిండు గర్బిణి ఆసుపత్రి సిబ్బంది కాళ్లు పట్టుకుంది. కనికరం లేకుండా ఆసుపత్రిలో నుంచి ఆమెను బయటకు పంపించేశారు. ఇంటికి వెళ్లిన నిండు గర్బిణి కవల పిల్లలకు జన్మనిచ్చింది. బిడ్డలు పుట్టిన కొంతపేసటికే తల్లికి రక్తం ఎక్కువగా పోవడం, పిల్లలకు చికిత్స అందకపోవడంతో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కవల పిల్లలు, తల్లి చనిపోవడానికి కారణం అయిన డాక్టర్, ముగ్గురు సిబ్బందిని ఆరోగ్య శాఖా మంత్రి సస్పెండ్ చేశారు. కేవలం ఆధార్ కార్డు లేదని నెపంతో నిర్లక్షంగా వ్యవహరించడంతో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

నాలుగు నెలల క్రితం భర్త చనిపోయాడు

నాలుగు నెలల క్రితం భర్త చనిపోయాడు

తమిళనాడుకు చెందిన కస్తూరి (30) అనే మహిళకు వివాహం అయ్యింది. కస్తూరికి ఆరు సంవత్సరాల వయసు ఉన్న కూతురు ఉంది. కర్ణాటకలోని తుమకూరు పట్టణంలోని భారతీనగర్ లో కస్తూరి ఆమె భర్త, కూతురుతో కలిసి నివాసం ఉంటున్నది. నాలుగు నెలల క్రితం కస్తూరి భర్త చనిపోయాడు, కస్తూరు అప్పటికే గర్బవతి అయ్యింది.

ఆసుపత్రికి వెళ్లిన నిండు గర్బిణి

ఆసుపత్రికి వెళ్లిన నిండు గర్బిణి

బుధవారం సాయంత్రం కస్తూరి పురిటి నొప్పులతో సతమతం అయ్యింది. సమీపంలో నివాసం ఉంటున్న ఓ డాక్టర్ సహాయంతో కస్తూరి తుమకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ఆ సందర్బంలో ఆసుపత్రి సిబ్బంది కస్తూరిని ఆధార్ కార్డు, గర్బవతులకు ప్రభుత్వం ఇచ్చే తల్లి కార్డు ఇవ్వాలని సూచించారు. తన దగ్గర ఆధార్ కార్డు, తల్లి కార్డు లేదని కస్తూరి చెప్పింది.

ఆధార్ కార్డు లేదని ?, బెంగళూరు వెళ్లి చూపించుకో

ఆధార్ కార్డు లేదని ?, బెంగళూరు వెళ్లి చూపించుకో

ఆధార్ కార్డు లేదని సాకుపెట్టుకున్న ఆసుపత్రి సిబ్బంది కస్తూరికి చికిత్స చెయ్యడానికి నిరాకరించారు. మీరు బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స చేసుకోవాలని కస్తూరికి ఉచిత సలహా ఇచ్చారు. నా దగ్గర డబ్బులు లేవని, నా భర్త నాలుగు నెలల క్రితమే చనిపోయాడని, దయచేసి ఇక్కడే తనకు చికిత్స అందించాలని నిండు గర్బిణి కస్తూరి ఆసుపత్రి సిబ్బంది కాళ్లు పట్టుకుంది.

ఇంట్లోనే ముగ్గురి ప్రాణాలు పోయాయి

ఇంట్లోనే ముగ్గురి ప్రాణాలు పోయాయి

ఏమాత్రం కనికరం లేకుండా ఆసుపత్రిలో నుంచి కస్తూరిని బయటకు పంపించేశారు. ఏం చెయ్యాలో తెలీక కస్తూరి ఇంటికి వెళ్లిపోయింది. గురువారం ఉదయం నిండు గర్బిణి కస్తూరి కవల పిల్లలకు జన్మనిచ్చింది. బిడ్డలు పుట్టిన కొంతపేసటికే కస్తూరి రక్తం ఎక్కువగా పోవడం, పిల్లలకు సరైన చికిత్స అందకపోవడంతో ఇంట్లోనే ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

మండిపడిన స్థానికులు

మండిపడిన స్థానికులు

కస్తూరితో పాటు ఆమె కవల పిల్లలు చనిపోవడానికి కారణం అయిన డాక్టర్, ఆసుపత్రి సిబ్బందిని సస్పెండ్ చెయ్యాలని స్థానికులు డిమాండ్ చేశారు. కేవలం ఆధార్ కార్డు లేదని నెపంతో నిర్లక్షంగా వ్యవహరించడంతో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు.

మాజీ సీఎం సిద్దరామయ్య ఫైర్

మాజీ సీఎం సిద్దరామయ్య ఫైర్

ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్, సిబ్బంది నిర్లక్షం కారణంగా కవల పిల్లలు, కస్తూరి చనిపోవడానికి కారణం అయిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ రాజీనామా చెయ్యాలని మాజీ సీఎం సిద్దరామయ్య డిమాండ్ చేశారు. తల్లీ కస్తూరి, కవల పిల్లలు చనిపోవడం కర్ణాటకలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+