Twist: లీడర్ మిస్ అయ్యాడని షాపింగ్ మాల్ పక్కనే ఉన్న వ్యాపారిని నరికేశారు, ట్విస్ట్ !
బెంగళూరు/ మంగళూరు: కర్ణాటకలో వరుస హత్యలు జరగడంతో ప్రజలు హడలిపోతున్నారు. కర్ణాటకలోని కరావళిలో జరుగుతున్న వరుస హత్యలు రాజకీయ రంగు పులుముకుంటోంది. రెండు రోజుల్లోనే హిందూ, ముస్లీం యువకులు దారుణ హత్యకు గురైనారు. రెండు రోజుల వ్యవదిలో బీజేపీ నాయకుడు హత్యకు గురి కావడంతో కరావళి ప్రాంతంతో పాటు కర్ణాటక ప్రజలు ఉలిక్కిపడ్డారు. బీజేపీ నాయకుడి హత్య కేసు దర్యాప్తులో ఉన్న సమయంలోనే ముస్లీం యువకుడు అదే టైపులో దారుణ హత్యకు గురైనాడు. అయితే హత్య చెయ్యాలని అనుకున్న నాయకుడు మిస్ కావడంతో అదే వర్గానికి చెందిన ముస్లీం యువకుడిని పోరపాటున హత్య చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

దక్షిణ కన్నడ జిల్లాలో ?
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సూళ్య తాలుకాలోని బెళ్లారే పట్టణంలో ప్రవీణ్ నెట్టూరు అలియాస్ ప్రవీణ్ (29) అనే యువకుడు బీజేపీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుని బెళ్లార పట్టణంలోని బెరువాజీ క్రాస్ లో కోళ్ల అంగడి నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. ఇదే మంగళవారం రోజు బైక్ లో వెళ్లిన ముగ్గురు వ్యక్తులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ మీద వేటకొడవళ్లతో దాడి చేసి అతన్ని వెంటాడి వెంటాడి నరికి చంపేశారు.

రెండు రోజుల్లో ఏం జరిగిందంటే ?
కర్ణాటకలోని మంగళూరుకు సమీపంలోని సూరత్కల్ లో గురువారం రాత్రి ఫాజిల్ అనే యువకుడు అతని స్నేహితులతో కలిసి మాట్లాడుతున్నాడు. ఆ సందర్బంలో మంకీ క్యాప్ లు వేసుకుని కొందరు యువకులు ఫాజిల్ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఫాజిల్ అతని పనిలో అతను ఉన్న సమయంలో మంకీ క్యాప్ లు వేసుకున్న వ్యక్తులు ఫాజిల్ ను దారుణంగా నరకడంతో పాటు ఇష్టం వచ్చినట్లు పొడిచేశారు.

వ్యాపారి ప్రాణం పోయింది
తీవ్రగాయాలైన ఫాజిల్ కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు, ఫాజిల్ స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కత్తిపోట్లు విపరీతంగా పడటంతో ఫాజిల్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఫాజిల్ హత్యకు గురి కావడంతో సూరత్కల్ తో పాటు మంగళూరుతో సహ నాలుగు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామని మంగళూరు పోలీసు అధికారులతో పాటు స్థానిక పోలీసులు తెలిపారు.

లీడర్ మిస్ అయ్యాడు..... హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్
ఫాజిల్ అతని స్నేహితులతో మాట్లాడుతున్న సందర్బంలో కొందరు వ్యక్తులు అతని మీద దాడి చేసి హత్య చేశారని పోలీసు అధికారులు అంటున్నారు. మంగళవారం రాత్రి కొందరు వ్యక్తులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ ను దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయం బయటకు వచ్చింది.. షాపింగ్ మాల్ కు ఎస్ డీపీఐ లీడర్ వస్తున్నాడని, అతన్ని చంపాలని వెళ్లిన యువకులు ఆ లీడర్ రాకపోవడంతో సమీపంలో ఉన్న మొబైల్ షాపు యజమాని ఫాజిల్ ను నరికి చంపేశారని పోలీసులు విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications