Twitter down : భారత్‌లో కొద్దిసేపు స్తంభించిన ట్విట్టర్ సేవలు...
మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ సేవలు భారత్‌లో గురువారం(జులై 1) కొద్దిసేపు స్తంభించిపోయాయి. పోస్టింగ్,సెర్చింగ్,షేరింగ్ వంటి ఫీచర్స్‌కు కొద్ది సమయం పాటు అంతరాయం కలిగింది. ఉదయం 7.10గంటల సమయంలో అంతరాయం తలెత్తగా...దాదాపు 6వేల పైచిలుకు మంది ట్విట్టర్ యూజర్లు దీనిపై ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత కాసేపటికే ట్విట్టర్ సేవలు పునరుదర్దించబడినట్లు 'ట్విట్టర్ సపోర్ట్' హ్యాండిల్ ప్రకటించింది. అంతరాయానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. అయితే ట్విట్టర్ సేవలు స్తంభించిపోవడానికి గల కారణమేంటన్నది ఆ సంస్థ వెల్లడించలేదు.

ట్విట్టర్ స్తంభించిన సమయంలో చాలామంది యూజర్లు తమ ట్వీట్స్ లోడ్ అవట్లేదని ఫిర్యాదు చేశారు. కాసేపటికి దీనిపై స్పందించిన ట్విట్టర్ సపోర్ట్... 'ట్వీట్స్ ఇప్పుడు తప్పక కనిపిస్తాయి.. అయితే ట్విట్టర్ వెబ్‌లోని ఇతర ఫీచర్స్ లోడ్ కాకపోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.' అని పేర్కొంది. ఆ తర్వాత కాసేపటికే ట్విట్టర్ సేవలు పూర్తి స్థాయిలో పునరుద్దరించబడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ట్విట్టర్ సేవలు ఇలాగే స్తంభించిన సంగతి తెలిసిందే.
కాగా,దేశంలో సోషల్ మీడియా నియంత్రణ కోసం ఫిబ్రవరి 25న ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం యూజర్ల సంఖ్య 50 లక్షలు దాటితే సోషల్ మీడియా సంస్థలు ఫిర్యాదుల పరిష్కారానికి ఓ అధికారిని నియమించి, ఆ వివరాలను ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది.నిబంధనలపై అంగీకారం తెలిపేందుకు ప్రభుత్వం సోషల్ మీడియా సంస్థలకు మూడు నెలల గడువు ఇచ్చింది. అయితే ఈ నిబంధనలను అంగీకరించడంలో ట్విట్టర్ తాత్సారం చేసింది.
తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిగా ధర్మేంద్ర చతుర్‌ను ట్విట్టర్ నియమించగా నెల రోజులు తిరగకముందే ఆయన రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో అమెరికాకు చెందిన వ్యక్తిని నియమించింది. ఐటీ నిబంధనల ప్రకారం గ్రీవెన్స్ అధికారి భారత్‌కు చెందినవారే అయి ఉండాలి. కానీ ట్విట్టర్ ఇలా నిబంధనలు ఉల్లంఘించేలా అమెరికాకు చెందిన వ్యక్తిని నియమించడం వివాదాస్పదంగా మారింది.
Aaaand we’re back. Twitter for web should be working as expected. Sorry for the interruption!
— Twitter Support (@TwitterSupport) July 1, 2021












Click it and Unblock the Notifications