Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రం హెచ్చరికలతో తగ్గిన ట్విట్టర్: తప్పుగా చూపిన భారత పటం తొలగింపు

న్యూఢిల్లీ: భారత భూభాగాలను తప్పుగా చూపుతూ వక్రబుద్ధిని ప్రదర్శించిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌.. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో దిగివచ్చింది. ప్రభుత్వంతోపాటు దేశ వ్యాప్తంగా పౌరుల నుంచి ట్విట్టర్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. ఆ తప్పుడు మ్యాపును వెబ్‌సైట్ నుంచి తొలగించింది.

కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లడఖ్‌ను వేరే దేశంగా చూపుతూ.. భారతదేశ పటాన్ని ట్విట్టర్ వక్రీకరించిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌లోని 'ట్వీప్ లైఫ్' సెక్షన్లో.. జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను భారత్‌లో భాగంగా చూపలేదు. వాటిని వేరే దేశంగా పేర్కొంది. భూభాగాలను తప్పుగా గుర్తించిన భారతదేశ పటం నెటిజన్ల దృష్టిలో పడటంతో.. వారు తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ దురహంకారాతో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

 Twitter removes Incorrect India Map From Its Website Amid backclash and warnings from central government

కేంద్ర ప్రభుత్వం కూడా ట్విట్టర్ చేసిన తప్పుడు పనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీవ్రమైన నేరం చేసిన ట్విట్టర్‌ కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదని స్పస్టం చేసింది. కాగా, దేశ మ్యాపును తప్పుగా చూపించడం చట్టరీత్యా నేరమని, దీనికి భారీ జరిమానాతోపాటు దేశంలోని సంస్థ అధికారులు జైలు శిక్ష కూడా అనుభవించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా, గతంలోనూ లేహ్ ప్రాంతాన్ని చైనాలో భాగంగా తప్పుగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు స్పందించారు. ట్విట్టర్ చర్యలు భారత ప్రయోజనాల పట్ల వివక్ష చూపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఈ దేశ చట్టాలను ట్విట్టర్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

మరోవైపు నూతన ఐటీ నిబంధనలు పాటించనందుకు కేంద్రం ఇప్పటికే ట్విట్టర్ పై చర్యలు ప్రారంభించింది. దీంతో సురక్షిత ఆశ్రయం(సేఫ్ హార్బర్) అనే రక్షణ కవచాన్ని ట్విట్టర్ కోల్పోయింది. పలు రాష్ట్రాల్లో ట్విట్టర్‌పై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల రవిశంకర్ ప్రసాద్ ఖాతాను గంటపాటు బ్లాక్ చేసిన విసయం తెలిసిందే. అంతకుముందు ఉపరాష్ట్రపతి తోపాటు పలువురి వెరీఫైడ్ మార్క్‌ను కూడా తొలగించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+