వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్ బీజేపీకి షాక్, హస్తం వైపు ఎమ్మెల్యేల చూపు

|
Google Oneindia TeluguNews

భోపాల్ : దేశవ్యాప్తంగా మోడీ ప్రభావంతో కమలం వికసిస్తోంది. నిన్న కర్ణాటకలో కూడా ఆ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం కమలం మాడిపోతోంది. అధికారానికి కాస్త దూరంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు కొందరు .. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతామని ప్రకటించారు. దీంతో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చినట్టైంది. దేశవ్యాప్తగా బీజేపీ హవా ఉన్న నేపథ్యంలో .. కర్ణాటకలో ప్రభుత్వాన్ని లాగేసుకున్న క్రమంలో కాంగ్రెస్ నేతలు తమ చాతురత్యతో కొంత షాకిచ్చారు. దీంతో ఏం చేయాలనే అంతర్మథనంలో బీజేపీ నేతలు ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సీఎంగా కమల్‌నాథ్ కొనసాగుతున్నారు. కర్ణాటక తర్వాత మధ్యప్రదేశ్ లో పాగా వేస్తామని బీజేపీ ఎంపీ కామెంట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతల దిమ్మతిరిగి మైండ్ బ్లోయింగ్ అయ్యే షాక్ ఇచ్చారు. బీజేపీకి చెందిన నారాయణ్ త్రిపాఠి, శరద్ కోల్ అనే ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ పార్టీలో చేరతామని ప్రకటించారు. కాసేపటి క్రితమే త్రిపాఠి కాంగ్రెస్ నేత సురేశ్ పచౌరిని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా అసెంబ్లీలో ఈ ఇద్దరూ ఎమ్మెల్యేలు వ్యవహరించారు. తర్వాతే పచౌరితో భేటీ .. హస్తం పార్టీలో చేరతామని ప్రకటించారు.

Two BJP MLAs back Kamal Nath government in assembly, likely to join Congress

అయితే వీరిద్దరూ మాజీ కాంగ్రెస్ నేతలే కావడం విశేషం. కానీ రాష్ట్రంలో కమల్ నాథ్ సర్కార్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై .. పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. దీంతోపాటు తమ నియోజకవర్గాల అభివృద్ధి కూడా ముఖ్యమేనని స్పస్టంచేశారు. ఇవాళ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో క్రిమినల్ లా 2019 చట్టం ప్రవేశపెట్టగా వీరిద్దరూ మద్దతు తెలిపారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ 121 సీట్లతో అధికారం చేపట్టింది. విపక్షాలు బీజేపీతో కలిసి 120 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అయితే వీరిలో ఇద్దరూ బీజేపీ సభ్యులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. అంతేకాదు తాము ఘర్ వాపసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్టు ఆ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అంతేకాదు తమది మైనార్టీ ప్రభుత్వమని రోజు చెప్పే బీజేపీకి .. ఇద్దరు సభ్యుల మద్దతు పెరిగిందని తెలిపారు.

English summary
in a major blow to the BJP in Madhya Pradesh, two of its MLAs Narayan Tripathi and Sharad Kol said they are not liking being a part of the BJP and will join the grand old party soon. Narayan Tripathi and Sharad Kol met senior Congress leader Suresh Pachouri at his residence after coting in favour of the Congress government during voting on a bill in the Assembly. The two MLAs have not reigned from the BJP yet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X