ఆర్ఎస్ పుర సెక్టార్‌లో పాక్ కాల్పులు: ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు

జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్‌ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. భారత దళాలు పాక్ కాల్పులను తిప్పికొడుతున్నాయని అధికారులు ప్రకటించారు.

జమ్మూకాశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లో భారత జవాన్లపై పాక్‌ జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Two civilians killed, four injured in ceasefire violation by Pakistan in RS Pura sector of Jammu and Kashmir

కాగా భారత్‌లో సరిహద్దు వెంట పాకిస్తాన్‌ జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాను, మరో యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆర్‌ఎస్‌ పురా, ఆర్నియా, రామ్‌గఢ్‌ సెక్టార్లలోని భారత ఔట్‌ పోస్టులపై బుధవారం నుంచి పాక్‌ కాల్పులు ప్రారంభించిందని బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు.

ఈ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ 78వ బెటాలియన్‌కు చెందిన తమిళనాడు వాసి, హెడ్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌ చనిపోయారు. సరిహద్దులో కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+