• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నా భార్య!: 'ఆమె'కోసం నడిరోడ్డుపై కొట్టుకున్నారు, మూడో వ్యక్తితో వెళ్లిన శశికళ

By Srinivas
|

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు - నేలమంగళ జాతీయ రహదారుపై శనివారం సాయంత్రం విస్తుపోయే సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి అక్కడ ఉండగా ఇద్దరు యువకులు.. ఆమె నా భార్య అంటే నా భార్య అని గొడవ పెట్టుకున్నారు. ఇదే ఆసక్తికరమంటే.. మరింత ఆసక్తికర సంఘటన ఆ తర్వాత జరిగింది. ఆ యువతి పోట్లాడుకుంటున్న ఇద్దరికీ షాకిచ్చింది. ఆమె మరొకరితో వెళ్లిపోయింది.

నెలమంగళ తాలూకా బివికెరె వద్ద శనివారం సాయంత్రం జరిగింది. చిక్కబిదరకల్లు ప్రాంతానికి చెందిన మూర్తి, సిద్ధరాజు అనే వ్యక్తులు, ఓ మహిళ కోసం వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆమెను చెరో చెయ్యి పట్టుకుని లాగారు. ఆ సమయంలో కొందరు చుట్టూ గుమికూడి ఉన్నారు. ఈ సంఘటనను కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నాకు భార్యగా కావాలంటే నాకు అంటూ

నాకు భార్యగా కావాలంటే నాకు అంటూ

ఈ వార్తను కన్నడ టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. విషయం ఏమంటే.. సదరు మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న ఈ ఇద్దరూ ఇలా గొడవకు దిగారని తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగారు. నాకు భార్యగా కావాలంటే.. నాకు భార్యగా కావాలని వారు వాగ్వాదానికి దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టగా గంటల్లోనే పెద్ద ఎత్తున వైరల్ అయింది.

 కొన్నాళ్లు అతనితో ఉండి

కొన్నాళ్లు అతనితో ఉండి

ఆ మహిళను 38 ఏళ్ల శశికళగా పోలీసులు గుర్తించారు. ఆమె ట్రాక్టర్ డ్రైవర్ మూర్తితో ఉంటోంది. అసలు శశికళకు 2000 సంవత్సరంలో రంగస్వామి అనే వ్యక్తితో పెళ్లయింది. 2010లో విడాకులు అయ్యాయి. ఆ తర్వాత ఆమె గార్మెంట్స్ ఫ్యాక్టరీ సూపర్ వైజర్ రమేష్ కుమార్‌తో ఉంటోంది. 2015లో మరో వ్యక్తితోను సంబంధం ఏర్పడింది. 2017లో శశికళ చిక్కబిదరుకళ్లు మూర్తితో ఉంటోంది. మూర్తికి అంతకుముందే పెళ్లయింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా.

క్యాబ్ డ్రైవర్‌తో శశికళకు పరిచయం, ప్రపోజ్

క్యాబ్ డ్రైవర్‌తో శశికళకు పరిచయం, ప్రపోజ్

ఆ తర్వాత శశికళ పని చేసే గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసే క్యాబ్ డ్రైవర్ సిద్ధరాజు పరిచయమయ్యాడు. అతను శశికళకు ప్రపోజ్ చేశాడు. సిద్ధరాజు బ్యాచిలర్. మూర్తికి అంతకుముందే పెళ్లైన విషయం తెలిసిందే. దీంతో శశికళ బ్యాచిలర్ అయిన సిద్ధరాజును పెళ్లాడాలని నిర్ణయించుకుంది. ఈ సమయంలో శనివారం సాయంత్రం సిద్ధరాజు, శశికళ బస్టాండ్ వద్ద నిల్చున్నారు. అప్పుడు ముర్తి చూశాడు. అతను సిద్ధరాజుపై దాడి చేశాడు.

ఇద్దర్నీ పెళ్లి చేసుకోనని, మూడో వ్యక్తితో వెళ్లిపోయింది

ఇద్దర్నీ పెళ్లి చేసుకోనని, మూడో వ్యక్తితో వెళ్లిపోయింది

ఆ సమయంలో సిద్ధరాజు, మూర్తిలు వాగ్వాదానికి దిగారు. అక్కడ నిలబడ్డ వారు ఆ గొడవను ఫోన్లో చిత్రీకరించారు. కొందరు పోలీసులకు సమాచారం అందించారు. నేలమంగళ పోలీసులు వచ్చేదాకా వారి గొడవ ఆగలేదు. శశికళ, మూర్తి, సిద్ధరాజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శశికళ మాట్లాడుతూ.. వారిద్దరు తన స్నేహితులు అని, వారిద్దరు తనను ప్రేమిస్తున్నారని, ఒకరిపై మరొకరు అసూయతో ఉన్నారని చెప్పింది. ఎవరిని పెళ్లి చేసుకుంటావని పోలీసులు ఆమెను అడగ్గా.. ఎవరినీ పెళ్లి చేసుకోనని చెప్పింది. ఆ తర్వాత శశికళకు చెందిన మరో స్నేహితుడు వచ్చాడు. అతనితో కలిసి ఆమె వెళ్లిపోయింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

మరిన్ని woman వార్తలుView All

English summary
Motorists on the Bengaluru-Nelamangala highway witnessed an unusual drama on Saturday: Two men bashing up each other for a woman in her presence! But it did not end there. The climax was even more filmi. While cops booked cases against both the men, the 38 year old woman claimed she’s not married to either of them, but to someone else. And eventually, she walked away with a ‘friend of hers. The entire episode was filmed by scores of onlooker on their cell phones.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more