లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్

కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన మేనిఫెస్టోను ఇటీవల విడుదల చేసింది. వికసిత కేరళం నినాదంతో సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఈ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ప్రత్యక్ష నగదు సహాయం నుండి మౌలిక సదుపాయాల విస్తరణ, సంస్థాగత సంస్కరణల వరకు పలు హామీలు ఇందులో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కు ధీటుగా ఓటుబ్యాంక్ ను సాధించాలనే ఉద్దేశం కనిపించింది.

నిత్యావసరాలు, మందులు..

కొద్దిసేపటి కిందటే తిరువనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్, ఇతర నాయకులు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజల కోసం నిర్దుష్ట సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చారు. పేద, బీపీఎల్ కుటుంబాల మహిళల కోసం భక్ష్య ఆరోగ్య సురక్షా కార్డ్ ను బీజేపీ ప్రతిపాదించింది. ఈ కార్డు ద్వారా నిత్యావసరాలు, మందుల కొనుగోలుకు నెలకు రూ. 2,500 రీఛార్జ్ అందుబాటులో ఉంటుంది.

Two Free LPG Cylinders Annually Rs 2500 Monthly Arogya Card and Rs 3000 Pension NDA Promises

ప్రతినెలా రూ. 3,000 పించను..

పేద మహిళా కుటుంబ పెద్ద, వితంతువులు, 70 ఏళ్లు పైనున్న సీనియర్ సిటిజన్లకు ప్రతినెలా రూ. 3,000 పించను అందిస్తామని హామీ ఇచ్చింది. ఓనం, క్రిస్మస్ పండుగల సందర్భంగా ఏడాదికి రెండు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లను అందజేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి ఇంటికి నెలకు 20,000 లీటర్ల ఉచిత నీటిని అందిస్తామని కూడా మేనేఫెస్టో ప్రకటించింది. వ్యవసాయ రంగంలో, అవసరమైన అన్ని పంటలకు కనీస మద్దతు ధర రక్షణ కల్పిస్తామని బీజేపీ పేర్కొంది.

ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై..

ప్రస్తుతం ఉన్న భూమి, అటవీ చట్టాలకు సవరణలు చేయడం ద్వారా తోటల భూముల్లో బహుళ పంటల సాగుకు అనుమతిస్తామని పేర్కొంది. ఆరోగ్య సంరక్షణకు మేనిఫెస్టోలో ప్రముఖ స్థానం కల్పించారు. ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై పథకాన్ని అందరికీ విస్తరింపజేస్తామని, కేరళలో మొదటి ఎయిమ్స్‌ను నిర్మిస్తామని ప్రకటించింది.

హైస్పీడ్ రైల్వే కారిడార్‌..

మౌలిక సదుపాయాల కల్పన మరో ప్రధాన లక్ష్యం. తిరువనంతపురం నుండి కన్నూరు వరకు హైస్పీడ్ రైల్వే కారిడార్‌ను ప్రతిపాదించింది బీజేపీ. కొచ్చి మెట్రో అన్ని దశల పూర్తి, అలాగే తిరువనంతపురం, కోజికోడ్‌లలో కొత్త మెట్రో ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు తెలిపింది. మేనిఫెస్టోలో ఉపాధి కల్పనకు కూడా ప్రాధాన్యతనిచ్చింది. ఉపాధి అనుసంధాన ప్రోత్సాహక పథకం కింద కేరళ నివాసితుల కోసం సృష్టించే ప్రతి ఉద్యోగానికి సంస్థలకు లక్ష సాఫ్ట్ లోన్లు లభిస్తాయి.

షిప్ రిపేర్, మెరైన్ ఇంజినీరింగ్ క్లస్టర్

విజింజమ్ పోర్ట్ చుట్టూ భారీ పారిశ్రామిక ప్రోత్సాహాన్ని బీజేపీ ఇందులో వివరించింది. ఈ పోర్ట్‌ను ఒక పెద్ద పారిశ్రామిక సముదాయంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. షిప్ రిపేర్, మెరైన్ ఇంజినీరింగ్ క్లస్టర్, నెమోమ్ యార్డ్ నుండి విజింజమ్ వరకు ఎలివేటెడ్ డబుల్ రైల్ లైన్, ప్రత్యేక పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు ఉన్నాయి.

ఇంగ్లీష్ మీడియం..

విద్యా రంగంలో రాబోయే అయిదేళ్లలో రాష్ట్ర-ప్రాయోజిత పాఠశాలల్లో ఆప్షనల్ ఇంగ్లీష్ మీడియం బోధనను క్రమంగా ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. మత, సంస్థాగత సంస్కరణలపై మేనిఫెస్టో హామీలు ఇచ్చింది. శబరిమల, గురువాయూర్ తో సహా కీలక పుణ్యక్షేత్రాలను సంరక్షించడం కోసం అందుబాటులో ఉన్న దేవస్వం బోర్డులను సంస్కరించి, భక్తుల భాగస్వామ్యాన్ని పెంచుతామని తెలిపింది.

ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌

నగర ఆధారిత ఆర్థిక వ్యూహాన్ని కూడా ఈ మేనిఫెస్టో వివరించింది. తిరువనంతపురాన్ని ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా, కొచ్చిని షిప్‌ బిల్డింగ్ రాజధానిగా, కోజికోడ్‌ను హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ హబ్‌గా, త్రిస్సూర్‌ను సాంస్కృతిక పర్యాటక రాజధానిగా, కొల్లాన్ని బ్లూ ఎకానమీ క్లస్టర్‌గా, కన్నూర్‌ను డిఫెన్స్ ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+