తీహార్ జైలులో గ్యాంగ్ వార్: ఖైదీ మృతి
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది. రెండు గ్యాంగ్ ల మద్య జరిగిన వార్ లో ఒక ఖైదీ మరణించాడు.ఎప్పుడు ఎవరు ఎవరి మీద దాడి చేస్తారో అంటూ జైలు సిబ్బంది హడలిపోతున్నారు. ముందు జాగ్రత చర్యగా జైళ్ల శాఖ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
తీహార్ జైల్ నెంబర్ - 1 లోని ఖైదీలు రెండు గ్రూపులుగా విడిపోయారు. వీరి మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న సిబ్బంది ఒక గ్యాంగ్ బయటకు వచ్చినప్పుడు ఇంకోక గ్యాంగ్ బయటకు రాకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు.

అయితే బుధవారం రాత్రి ఇరు వర్గాలు ఎదురుపడ్డారు. ఆ సమయంలో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ గ్యాంగ్ వార్ లో రవీంద్ర అనే ఖైదీకి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అతనిని డీడీయూ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై అతను రవీంద్ర మృతి చెందాడని పోలీసు అధికారులు చెప్పారు.
రిహాజ్, కిరణ్, వినోద్, అజయ్,కరణ్ అనే ఖైదీలు రవీంద్ర మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశారని, తరువాత పదునైన స్పూన్ ఉపయోగించి పోడవడం వలన మరణించాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. నలుగురు ఖైదీలను విచారణ చేస్తున్నామని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications