ఢిల్లీలో టాంజానియా మహిళలపై రేప్: ఇద్దరి అరెస్టు
న్యూఢిల్లీ: ఇద్దరు టాంజానియా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఇద్దరు యువకులకు కూడా దాదాపు 20 ఏళ్ల వయస్సు ఉంటుంది. పోలీసులు శనివారం ఈ విషయం చెప్పారు.
ఢిల్లీలోని శాస్త్రినగర్‌కు చెందిన కునాల్, ఆర్‌కె పురానికి చెందిన సతీష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరు సరోజినీనగర్‌లోని ఓ కామన్ ఫ్రెండ్ ఇంట్లో ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మహిళలు పోలీసులకు ఫోన్ చేశారు. దాంతో వారిని అరెస్టు చేశారు.

తమను ఆ ఇంటికి తీసుకుని వెళ్లి తమపై అత్యాచారం చేశారని మహిళలు ఆరోపించారు. మహిళలకు ఆ యువకులు ముందే తెలుసునని పోలీసులు చెప్పారు.
మహిళలు యువకులతో వాగ్వివాదానికి దిగారని, ఈ సమయంలో మహిళలకు తమకు ఫోన్ చేశారని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications