modi two independent support jds karnataka government bjp mlas ministers party మోడీ మద్దతు కాంగ్రెస్ జేడీఎస్ కర్ణాటక ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీ
కర్ణాటక ప్రభుత్వానికి సినిమా కష్టాలు, ఎమ్మెల్యేలు రాజీనామా ? మతిపోయిందా, అయోమయం!
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇంటికి పంపించాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడకట్టుకోవడంలో నిమగ్నం అయ్యారని తెలిసింది. అసమ్మతి ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడానికి సి్దం కావడంతో ప్రభుత్వానికి సినిమా కష్టాలు మొదలైనాయి.

ముంబైలో ప్రకటన
కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నామని స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు ముంబైలో ప్రకటించారు. స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు ఆర్. శంకర్, హెచ్. నాగరాజ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించామని మీడియాకు చెప్పించడంలో బీజేపీ నాయకుల ప్రయత్నాలు ఫలించాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం
స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంలో విజయం సాధించిన బీజేపీ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేశారు. మొదట ఆరు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు తీసుకున్న బీజేపీ నాయకులు ఆ సంఖ్యను 7 కు చేర్చారని సమాచారం.

స్పీకర్ తో ఎమ్మెల్యేలు భేటీ ?
గురువారం (జ��వరి 17) అసమ్మతి ఎమ్మెల్యేలు స్పీకర్ రమేష్ కుమార్ తో భేటీ అయ్యి కర్ణాటక ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నామని, బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. జీవర్గి ఎమ్మెల్యే (కాంగ్రెస్) డాక్టర్. అజయ్ సింగ్ కు బీజేపీ నాయకులు గాలం వేశారని, అయితే ఆయన తనకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చెయ్యలేనని చెప్పారని సమాచారం.

లీడర్ కు కబురు !
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్న కేసీ. వేణుగోపాల్ బెంగళూరు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్నారని ప్రచారం జరుగుతున్న అటవి శాఖా మంత్రి రమేష్ జారకి హోళికి
అత్యున్నత పదవి ఇవ్వడానికి హై కమాండ్ సిద్దం అయ్యిందని సమాచారం. వెంటనే బెంగళూరు రావాలని మంత్రి రమేష్ జారకిహోళికి కేసీ. వేణుగోపాల్ సూచి��చారని సమాచారం.

మీడియాకు మతి పోయిందా ?
కర్ణాటకలో జరిగే ప్రతి విషయం క్షణక్షణం తనకు తెలుస్తోందని ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాకు చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఎమ్మెల్యేలను గుర్రాలను కొనుగోలు చేసినట్లు వ్యాపారం చేస్తున్నారని సీఎం. కుమారస్వామి ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందని మీడియా అతిగా ప్రచారం చేస్తోందని, మీరు ఫూల్స్ కావడం కాక���ండ ప్రజలనూ ఫూల్స్ చేస్తున్నారని మీడియా పై సీఎం. కుమారస్వామి మండిపడ్డారు.

రాజీనామకు ఎమ్మెల్యేలు సిద్దం !
* రమేష్ జారకి హోళి- గోకాక్ ఎమ్మెల్యే (మంత్రి)
* నాగేంద్ర- బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే
* ఉమేష్ జాధవ్ - చుంచోళి ఎమ్మెల్యే
* మహేష్ కుమటళ్ళి- అథణి ఎమ్మెల్యే
* భీమా నాయక్- హగరి బోమ్మనహళ్ళి
* జేఎన్. గణేష్- కంప్లీ ఎమ్మెల్యే
* ప్రతాప్ గౌడ పాటిల్- మస్కి ఎమ్మెల్యే

ఎవరు బీజేపీ మాస్టర్ ప్లాన్
* ఆపరేషన్ కమల కొనసాగించడం.
* అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 221కు తగ్గించడం.
* మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు 116కు కూడగట్టుకోవడం.
* 16 మంది అసమ్మతి ఎమ్మెల్యేల మద్దతు కూడకట్టుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చెయ్యడం.
* ముంబై, గురుగ్రామ్ లోని అసమ్మతి ఎమ్మెల్యేలను రక్షించుకోవడం బీజేపీకి ప్రస్తుతం సవాలుగా మారింది.