భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : కశ్మీర్‌లో నక్కిన ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. షోపియాన్ జిల్లాలో దాగి ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంతలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో .. సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
తనిఖీలు చేస్తుండగా కాల్పులు ..
సోషియాన్ జిల్లా అవ్‌నీరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. నిన్న సాయంత్రం నుంచి ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అయితే ఇంట్లో దాగి ఉన్న ఉగ్రవాదులు ఇవాళ ఉదయం పోలీసులను చూసి అప్రమత్తమయ్యారు. వెంటనే కాల్పులు ప్రారంభించారు.

దీంతో ప్రతీగా సిబ్బంది ఎదురుకాల్పులు చేశారు. భద్రతాసిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని సయద్ అహ్మద్ భట్, షకీర్ అహ్మద్ వాగేగా గుర్తించారు. అహ్మద్ భట్ సనావుల్లాహ్ కుమారుడని తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదులు అన్సార్ గజ్వాతుల్ హింద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని పోలీసులు మీడియాకు వివరించారు.
కూంబింగ్ ..
ఎన్‌కౌంటర్ తర్వాత కూడా ఆ ప్రాంతంలో తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. గతేడాది కన్నా ఈ సారి కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల పెరిగాయని ఇటీవల కేంద్ర హోంశాఖ నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఉగ్రవాదుల అలజడి కలకలం రేపుతోంది. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు .. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications