innova: క్షణాల్లో కలకలం రేపిన ఇన్నోవా కారు, ఇద్దరి ప్రాణాలు ?, కారు మీద సిట్టింగ్ ఎమ్మెల్యే స్టిక్కర్ !
వాయువేగంతో వెళ్లిన ఇన్నోవా కారు రెండు కార్లు, మూడు బైక్ లను ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారుకు ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే పేరుతో విధాన సౌధ ఎంట్రీ పాస్ అతికించి ఉండటం కలకలం రేపింది.
బెంగళూరు/యలహంక: సచివాలయం, మెజిస్ట్రేట్ కోర్టు, లోకాయుక్త ఆఫీసు, సమీపంలో డీజీపీ ఆఫీసు, కొంచెం దూరంలో హైకోర్టు ఇలా ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు చాలా వరకు ఆ రోడ్డు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో వేగంగా ఇన్నోవా కారు దూసుకు వెళ్లింది. వాయువేగంతో వెళ్లిన ఇన్నోవా కారు రెండు కార్లు, మూడు బైక్ లను ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదానికి కారణం అయిన డ్రైవర్ కారు అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. కారుకు ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే పేరుతో విధాన సౌధ ఎంట్రీ పాస్ అతికించి ఉండటం కలకలం రేపింది. అయితే ఇద్దరి ప్రాణాలు పోయిన తరువాత ఆ కారుకు ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ను పీకేయడం హాట్ టాపిక్ అయ్యింది.

తల మీద దూసుకుపోయిన ఇన్నోవా కారు
బెంగళూరు నగరంలోని నృపతుంగ రోడ్డులోని మేజిస్ట్రేట్ కోర్టు సమీపంలోకి బైక్‌పై ఇద్దరు వెలుతున్నారు. ఆ సమయంలో ఇన్నోవా క్రిష్టా కారు వాయువేగంతో వెళ్లి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ లో వెలుతున్న ఇద్దరూ కిందపడిపోయారు. కిందపడిన ఓ వ్యక్తి తల మీద, మరో వ్యక్తి కాలు మీద అదే ఇన్నోవా కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బెంగళూరులోని హెచ్ఆర్ బీఆర్ లేఔట్ లో నివాసం ఉంటున్న మాజిద్ ఖాన్ (39) అనే వ్యక్తి స్పాట్ లో చనిపోయాడు.

ఆసుపత్రిలో మరో ప్రాణం పోయింది
రియాజ్ అనే వ్యక్తి కాలు విరిగిపోవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రమాదంలో తీవ్రగాయాలైన కేజీ హళ్లి నివాసి అయ్యప్ప (60) అనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై అయ్యప్ప చనిపోయాడని హలసూరు గేట్ ట్రాఫిక్ పోలీసులు చప్పారు. ఈ సకరమాదంలో మరి కొంతమందికి గాయాలైనాయని, అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు అన్నారు.

యలహంకలో రిజిస్ట్రేషన్
KA 50 MA 6600 అనే నంబర్ ఉన్న ఇన్నో వా క్రిష్టా కారు అటవి వాఖలో పని చేస్తూ రిటైడ్ అయిన రాము సురేష్ అనే వ్యక్తి పేరు మీద బెంగళూరులోని యలహంక ఆర్ టీఓ కార్యాలయంలో రిజిస్టర్ అయ్యిందని పోలీసులు అన్నారు. ఈ ఇన్నోవా కారును డ్రైవర్ మోహన్ (48) అనే వ్యక్తి నడుపుతున్నాడని, ఆ సమయంలో కారులో ఎవరూ లేరని పోలీసులు అంటున్నారు. కారు నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని హలసూరు గేట్ ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.

కారు మీద ఎమ్మెల్యే స్టిక్కర్
నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో కారు ఇష్టం వచ్చినట్లు నడిపి ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణం అయిన ఇన్నోవా కారు మీద కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సాగర ఎమ్మెల్యే హలతాళు హాలప్ప అలియాస్ హెచ్, హాలప్ప పేరుతో విధాన సౌధలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇచ్చే స్టిక్కర్ ఉండటం హాట్ టాపిక్ అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే కొందరు వ్యక్తులు కారు మీద ఉన్న ఎమ్మెల్యే హరతాళు హాలప్ప స్టిక్కర్ ను తొలగించారని ఆరోపణలు ఉన్నాయి.

ఎమ్మెల్యే స్టిక్కర్ ఎవరు ఇచ్చారు ?.... కారులో ఎవరెవరు తిరుగుతున్నారు
సిట్టింగ్ ఎమ్మెల్యే హెచ్, హాలప్ప పేరుతో ఉన్న స్టిక్కర్ వీళ్లకు ఎవరు ఇచ్చారు ?, ఈ కారులో ఎవరెవరు తిరుగుతున్నారు అని మొత్తం వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు అంటున్నారు. ప్రమాదానికి కారణం అయిన ఇన్నోవా క్రిష్టా కారును హలసూరు గేట్ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. ఈ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హాలప్పను సంప్రధించాలని కన్నడ మీడియా ప్రయత్నిస్తే ఆయన అందుబాటులో లేరని తెలిసింది.

కలకలం రేపిన ఇన్నోవా క్రిష్టా కారు
మొత్తం మీద చివాలయం, మెజిస్ట్రేట్ కోర్టు, లోకాయుక్త ఆఫీసు, సమీపంలో డీజీపీ ఆఫీసు, కొంచెం దూరంలో హైకోర్టు ఇలా ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు చాలా వరకు ఉండే పరిసర ప్రాంతాల్లోని ఓ రోడ్డు మీద ఇన్నోవా కారు అతివేగంగా నడిపి ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో బెంగళూరు ప్రజలు హడలిపోయారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మాజిద్ ఖాన్ ఆటో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications