Karnataka: కర్ణాటకలో పెరుగుతోన్న కరోనా కేసులు..!

కర్ణాటకలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. బెంగళూరు సిటీ కార్పొరేషన్ పరిమితులలో రెండు అనుమానాస్పద కోవిడ్ -19 మరణాలను నమోదయినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకటి రేస్ కోర్స్ రోడ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో, మరొకటి హెబ్బల్‌లో నమోదు అయినట్లు తెలుస్తోంది. అధికారు ఈ మరణాలను ఇంకా ధృవీకరించలేదు. కోవిడ్ వల్ల ఇటీవల ఇద్దరు వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే. దీంతో బెంగళూరు నగర పౌర సంస్థ, బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP), నగరంలో నిర్వహించిన COVID-19 పరీక్షల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది.

బెంగళూరు అర్బన్, BBMP సరిహద్దుల్లో రోజుకు 1,500 మందిని పరీక్షించడం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొన్నారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 మధ్య, 59 మంది వ్యక్తులు కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి బీబీఎంబీ డేటాను అందుకుంది. ఆసుపత్రులు, కమర్షియల్ ల్యాబ్‌లలో ఎక్కువ పరీక్షలు చేయడం వల్ల కేసులలో ప్రస్తుత పెరుగుదల ఎందుకు ఉందని అధికారులు ఆరా తీస్తున్నారు.

Two suspected Covid-19 deaths have been reported in Bangalore City Corporation limits in Karnataka

ముఖ్యంగా కొత్త కరోనావైరస్ సబ్-వేరియంట్ కేసులు ఎన్ని నమోదయ్యాయో తెలుసుకుంటున్నారు. బీబీఎంబీ పరిధిలో ఇప్పుడు రోజుకు 350 నుంచి 400 మందికి పరీక్షలు చేస్తున్నారు. "రాబోయే రోజుల్లో మేము ఎక్కువ మంది వ్యక్తులను పరీక్షిస్తున్నందున, కోవిడ్ -19 కేసుల సంఖ్య చివరికి పెరుగుతుంది. అయినప్పటికీ, రోగికి ఎటువంటి కోమోర్బిడ్ పరిస్థితులు లేనంత వరకు భయపడాల్సిన అవసరం లేదు " అని ఓ అధికారి తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో కొమొర్బిడ్ పరిస్థితులతో మరో ఇద్దరు వ్యక్తులకు కొనసాగుతున్న చికిత్సతో BBMP రెండు అనుమానిత కోవిడ్-19 మరణాలను నివేదించింది.

144 ఆరోగ్య కేంద్రాలు, 242 నమ్మ క్లినిక్‌లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా కేసు నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మస్కులు వేసుకోవాలని ప్రజలకు సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+