Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్ టీసీలో లేడీస్ కు ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఒకే ఆధార్ నెంబర్ తో బుర్కాలు వేసుకున్న లేడీఎస్ ఏం చేశారంటే ?

కర్ణాటకలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించిన విధంగా మహిళలకు ఉచిత ప్రభుత్వ బస్సు ప్రయాణం కోసం శక్తి పథకాన్ని అమలు చేసింది. మైనారిటీలను నిత్యం మభ్యపెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని ముస్లిం మహిళలే దుర్వినియోగం చేస్తున్నారని వెలుగు చూడటంతో అనేక అనుమానం వ్యక్తం అవుతున్నాయి.

కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దుర్వినియోగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కర్ణాటకలో మహిళలు ఆర్ టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి ప్రవేశపెట్టిన శక్తి పథకంకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన శక్తి పథకాన్ని ఒకే ప్రాంతంలో, ఒకే వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ఒకే బస్సులో దుర్వినియోగం చేశారు.

Two women with the same Aadhaar card number were caught by the conductor while roaming freely in the RTC bus.

ఈ విషయాన్ని ఆర్ టీసీ బస్సు కండెక్టర్ స్వయంగా తనిఖీలో గుర్తించారు. ఈ ఘటన కర్ణాటకోని హుబ్బళిలోని నేకార నగర్ లోని పాత హుబ్బళి బోర్డు రవాణా బస్సులో జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఆనంద్ నగర్ నుండి కేఎంసీ ప్రాంతానికి ఇద్దరు మహిళలు ఒకే ఆధార్ నెంబర్ తో ప్రయాణిస్తుండగా కండెక్టర్ వారిని గుర్తించడంతో అసలు మ్యాటర్ వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను బీజేపీకి చెందిన కెంపన్న పాటిల్ అనే వ్యక్తి ఆయన ఎక్స్ ఖాతాలో (ట్విట్టర్ లో) షేర్ చేశారు.

ఆర్ టీసీ బస్సు కండెక్టర్ పట్టుకున్న ప్రయాణికులు ఇద్దరు మహిళలు ఒకే ఆధార్ కార్డు చూపించి ఉచితంగా బస్సులో ప్రయాణిస్తూ పట్టుబడ్డారు. ఉచిత ప్రయాణం కోసం కండెక్టర్లకు ఒకే ఆధార్ నంబర్‌ ఉన్న రెండు ఆధార్ కార్డులు ఇచ్చారు. అందులో భిన్నమైన ఫోటోలు ఉన్నాయి. అయితే అది ఎవరి ఆధార్ కార్డు అని కండెక్టర్ ఆ మహిళలను ప్రశ్నించాడు. అయితే ఇద్దరు మహిళలు నీళ్లు నమలడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది

మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ శక్తి పథకంలో భాగంగా ఆధార్ కార్డు చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కానీ హుబ్బళిలో మాత్రం ఇద్దరు ముస్లీం మహిళలు ఒకే ఆధార్ నంబర్ చూపిస్తూ ప్రయాణం మొదలుపెట్టారు. అయితే ఇద్దరు మహిళలు ఒకేసారి ఒకే ఆర్ టీసీ బస్సులో ఒకే ఆధార్ కార్డు నెంబర్ తో ప్రయాణించడంతో వారిని పట్టుకున్న కండెక్టర్ ఆయనే స్వయంగా వీడియో తియ్యడంతో ఆ మ్యాటర్ లీక్ అయ్యింది.

వీడియోలో కండెక్టర్ అసలు మ్యాటర్ వివరించాడు. ఒకే ఆధార్ కార్డు, ఒకే ఆధార్ నంబర్ ఉన్న ఇద్దరు మహిళలు ముఖానికి బుర్కావేసుకుని ఆర్ టీసీ బస్సులో ఫ్రీగా తిరుగుతున్నారని, ఇది ఆనంద్ నగర్-కేఎమ్‌సీ రూట్ లో సంచరించే బస్సులో జరిగిందని, ఇక్కడ ప్రయాణికులు వాళ్లకు ఏమి చేయాలనుకుంటే అది చేస్తున్నారని, ఈ చర్యను ఈ మహిళలు గురించి సీనియర్ అధికారులకు తెలియాలనే ఈవీడియో తీశానని కండెక్టర్ వివరించాడు.

ఇదే సమయంలో ఇద్దరు మహిళలు బుర్కాలు వేసుకుని ఉన్న సమయంలో ఆ వీడియో తీశారు. కర్ణాటకలో అధికారంలోకి రావాలని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ హడావుడిగా ఐదారు హామీ పథకాలను అమలు చేసింది. శక్తి పథకం అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఇలా ప్రజల సొమ్ము నీరుపాలు అవుతోందని నెటిజన్లు మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+