లేడీ ఎగ్జిక్యూటివ్‌పై రేప్: ఉబేర్ డ్రైవర్‌కు జీవితఖైదు
న్యూఢిల్లీ: మహిళా ఎగ్జిక్యూటివ్‌పై అత్యాచారం కేసులో ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌కు కోర్టు జీవితఖైదు విధించింది. నిరుడు మహిళా ఎగ్జిక్యూటివ్‌పై అత్యాచారం కేసులో శివ కుమార్ యాదవ్ దోషిగా తేలిన విషయం తెలిసిందే.
32 ఏళ్ల శివకుమార్ కిరాతకమైన నేరానికి పాల్పడ్డాడని, బలమైన సంకేతాలు బయటకు వెళ్లాల్సిన అవసరం ఉందని ప్రాసిక్యూషన్ మంగళవారం తన వాదనను వినిపించింది. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 99 పేజీల తీర్పును వెలువరించింది.
కోర్టు తీర్పు వెలువరించే సమయంలో దోషి భార్య, ఇద్దరు కూతుళ్లు కూడా కోర్టులో ఉన్నారు. అత్యాచారం కేసులో శివకుమార్ యాదవ్‌ను కోర్టు అక్టోబర్ 20వ తేదీన దోషిగా తేల్చింది. నిరుడు డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీలో పాతికేళ్ల మహిళపై టాక్సీలో శివకుమార్ యాదవ్ అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి.

కేసులో శివకుమార్ యాదవ్‌ను ఇరికించారని, ఇతర కేసుల్లో అతను నిర్దోషిగా తేలాడని, అందువల్ల నేర చరిత్ర ఉందని చెప్పలేమని, అందువల్ల అతనికి నేరాలు చేసిన చరిత్ర ఉందని చెప్పడానికి వీలు లేదని, ఈ విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని శివకుమార్ తరఫు న్యాయవాడి డికె మిశ్రా అన్నారు.
తీహార్ జైలు నుంచి తీసుకుని వచ్చి శివ కుమార్ యాదవ్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తీర్పుతో అతను నివ్వెరపోయాడు. కోర్టు తీర్పుతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తీర్పు వెలువడిన మరుక్షణం శివకుమార్ యాదవ్ భార్య. ఇద్దరు పిల్లలు బోరున విలపించారు.












Click it and Unblock the Notifications