UCC పై కేంద్రం బిగ్ ప్లాన్? పార్లమెంట్ చేయాల్సిన పని అసెంబ్లీలతో ఎందుకంటే?

దశాబ్దాలుగా బీజేపీ అజెండాలో ఉన్న ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలును దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం సిద్దమవుతోంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2029 నాటికి దేశంలోని 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో దీన్ని అమలు చేసి తీరుతామని ప్రకటించారు. ఈ దిశగా ఆయన పావులు కదుపుతున్నారు. అయితే ఉమ్మడి పౌరస్మృతిని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నప్పుడు ట్రిపుల్ తలాక్ తరహాలో పార్లమెంట్ లో చట్టం చేయకుండా రాష్ట్రాల అసెంబ్లీల ద్వారా అమలు చేయించడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్కడే బీజేపీ వ్యూహం దాగి ఉంది.

ఉమ్మడి పౌరస్మృతి అమలు (UCC)

ఇప్పటికే గుజరాత్, అసోం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతిపై అసెంబ్లీలు చట్టాలు చేశాయి. దీన్ని లింగ సమానత్వ సంస్కరణా లేక మెజారిటీవాద చట్రం ద్వారా మైనారిటీల వ్యక్తిగత చట్టాలను మార్చే ప్రయత్నమా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అటు ఎన్డీయే మిత్రపక్షాలు సైతం తాము యూసీసీకి వ్యతిరేకం కాదని, అయితే అది బలవంతంగా రుద్దబడకుండా ఏకాభిప్రాయంతో రావాలని కోరుకుంటున్నట్లు చెప్తున్నాయి. ఇప్పటికే లా కమిషన్ కు ఈ మేరకు జేడీయూతో పాటు టీడీపీ వంటి మిత్రపక్షాలు ఇదే అభిప్రాయం చెప్పాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం భారతదేశ భూభాగం అంతటా పౌరుల కోసం ఉమ్మడి పౌర స్మృతిని సాధించడానికి రాజ్యం కృషి చేయాలని చెప్పింది. కానీ ఇది ప్రాథమిక హక్కులలో భాగం కాదు, ఆదేశ సూత్రాల్లో భాగం మాత్రమే. కాబట్టి ఏ మత చట్టాన్ని ఉమ్మడి పౌరస్మృతి చేయాలన్న దానిపై చర్చ జరుగుతోంది.

UCC Before 2029 Why Amit Shah Is Focusing on States Instead of Parliament

అమలులో అసలు సమస్యలివే

వివాహం, విడాకులు, దత్తత, వీలునామాలు, వీలునామా లేకుండా ఆస్తి పంపిణీ, వారసత్వం, ఉమ్మడి కుటుంబ విషయాలు ఉమ్మడి జాబితాలోని ఐదో అంశం కిందకు వస్తాయి. ఇది పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభలకు శాసన నిర్మాణ అధికారాన్ని ఇస్తుంది. కానీ రాజకీయ కారణం మరింత ముఖ్యమైనది. ఒకే జాతీయ చట్టం తీసుకురావాలంటే, భారతదేశంలోని వ్యక్తిగత చట్టాలు , ఆచారాలలో.. ముఖ్యంగా గిరిజన వర్గాల్లో, ఈశాన్య ప్రాంతంలో ఉన్న వైవిధ్యాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. 2023లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు వ్యక్తం చేసిన ఆందోళన సరిగ్గా ఇదే. అప్పుడు ఒక బీజేపీ కార్యకర్త 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో మాట్లాడుతూ, యూసీసీని క్రిమినల్ చట్టంలాగా సులభంగా క్రోడీకరించలేమని, ఎందుకంటే ఉత్తరాఖండ్ లేదా హిమాచల్ ప్రదేశ్‌లోని గిరిజన వర్గాల ఆచారాలు ఛత్తీస్‌గఢ్ లేదా ఈశాన్య ప్రాంతంలోని వర్గాల ఆచారాల కంటే భిన్నంగా ఉంటాయన్నారు.

UCC Before 2029 Why Amit Shah Is Focusing on States Instead of Parliament

పార్లమెంట్ కాకుండా అసెంబ్లీల ద్వారా ఎందుకు ?

అయితే ఇప్పుడు కేంద్రం ట్రిపుల్ తలాక్ తరహాలో పార్లమెంట్ లో ఉమ్మడి పౌరస్మృతిపై చట్టం చేయకుండా 21 రాష్ట్రాల్లో అమలు చేస్తామని చెప్పడం వెనుక భారీ వ్యూహం దాగి ఉంది. రాష్ట్రాల వారీగా చట్టం తీసుకురావడం ద్వారా, దేశవ్యాప్త చట్టం యొక్క పూర్తి రాజకీయ, రాజ్యాంగపరమైన సంక్లిష్టతను ముందుగా ఎదుర్కోకుండా, బీజేపీ విభిన్న నమూనాలను పరీక్షించడానికి, స్థానిక ఆచారాలను పరిష్కరించడానికి, అమలును ప్రదర్శించడానికి వీలు కలుగుతుంది. ఇది ఉమ్మడి పౌరస్మృతిని రాజకీయంగా సజీవంగా ఉంచుతూనే, దానిని సమాన హక్కులు, సామాజిక సంస్కరణల చర్యగా ప్రదర్శించడానికి బీజేపీకి వీలు కల్పిస్తుంది. అలా కాకుండా పార్లమెంట్ లో చట్టం చేస్తే వివిధ రాష్ట్రాల్లో గిరిజనులతో పాటు ముస్లింల నుంచి ఒకేసారి వ్యతిరేకత రావడం ఖాయం. అప్పుడు గిరిజనుల్ని మినహాయించి ముస్లింలను దీని పరిధిలోకి తెస్తే కోర్టుల నుంచి సమస్యలు ఎదుర్కోవాలి. అందుకే ముందు రాష్ట్రాల్లో వరుసగా దీన్ని ప్రయోగించి చూడాలనే ఆలోచనలో బీజేపీ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+