పాక్ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల(ఫొటో)
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రాణాలతో పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది నవేద్‌తో పాటు భారత్‌లోకి ప్రవేశించిన మరో ఇద్దరు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం విడుదల చేసింది.
ఇటీవల కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఉగ్రవాదులు దాడులు జరపగా, అందులో ఓ ఉగ్రవాది నవేద్ భారత సైన్యానికి ప్రాణాలతో పట్టుబడ్డ విషయం తెలిసిందే.
పాక్‌కు చెందిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత్‌లో ప్రవేశించారు. వీరిలో నవేద్, మహ్మద్ నోమన్ అనే ఇద్దరు ఉధంపూర్‌లో దాడులు జరిపారు. భారత భద్రతా దళాల కాల్పుల్లో నోమన్ మృతి చెందగా, నవేద్ ప్రాణాలతో పట్టుబడ్డాడు.

మరో ఇద్దరు జార్గమ్ అలియాస్ మహ్మద్ భాయ్, అబు ఓకాష అనే ఉగ్రవాదులు పరారీలో ఉన్నారు. జార్గమ్ వయస్సు 38 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, అబు ఓకాష వయస్సు 17 నుంచి 18ఏళ్ల మధ్య ఉంటుందని ఎన్ఐఏ పేర్కొంది.
కాగా, అయితే నవేద్‌ను సోమవారం ఢిల్లీ కోర్టులో విచారించారు. నవేద్ తెలిపిన వివరాల ప్రకారం పరారీలో ఉన్న ఉగ్రవాదుల ఊహా చిత్రాలను ఎన్‌ఐఏ అధికారులు మంగళవారం విడుదల చేశారు. వారిని పట్టించిన వారికి రూ. 10లక్షల రివార్డును కూడా ప్రకటించారు. ఈ ఉగ్రవాదులంతా పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications