మమతకు ఉద్దవ్ షాక్: 15న మీటింగ్‌కు గైర్హాజరు.. ఆ సమయంలో అయోధ్యలో..
రాష్ట్రపతి ఎన్నిక కోసం ఉమ్మడి అభ్యర్థిని బరిలోని నిలుపాలని టీఎంసీ భావిస్తోంది. అందుకే ఈ నెల 15వ తేదీ ఢిల్లీలో గల కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే 22 మంది జాతీయ నేతలకు ఆమె లేఖ కూడా రాశారు. అయితే శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే మాత్రం సమావేశానికి హాజరు కావడం లేదు. ఈ విషయం దీదీకి షాక్‌నకు గురిచేసింది.

ఉద్దవ్ నో
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల పాత్రపై చర్చించేందుకు మమత బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఉద్ధవ్ థాకరే హాజరు కావడం లేదు. ఢిల్లీలో సమావేశం జరగబోతుండగా, అదే సమయంలో థాకరే అయోధ్య పర్యటనలో ఉంటారని తెలుస్తోంది. ఎన్నికల విషయంలో అనుసరించవలసిన వ్యూహంపై చర్చించేందుకు మమత బెనర్జీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు.

ఇన్వైట్ చేశారు.. కానీ
ఢిల్లీలో జూన్ 15న జరిగే సమావేశానికి ఉద్ధవ్ థాకరేకు ఆహ్వానం అందిందని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఆయన ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.
అయితే తాము ఆ రోజున అయోధ్యలో ఉంటామని, అందువల్ల తమ పార్టీకి చెందిన ప్రముఖ నేత ఒకరు సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. ఉద్ధవ్ అయోధ్య పర్యటన గురించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. సరిగ్గా ఆ సమయంలో.. ఆహ్వానం రావడంతో ఉద్దవ్ వెళ్లే వీలు లేకుండా పోయింది.

సోనియా కూడా..
మమత బెనర్జీ ఆహ్వానించినవారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణకు గొప్ప అవకాశమని మమత తన లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్రపతి పదవీకి అభ్యర్థిని నిర్ణయించడంలో భాగస్వాములు అవడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలకు వీలుకలుగుతుందన్నారు.

సీఎంలు
8 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సహా 22 మంది జాతీయ నేతలకు మమత లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా విపక్షాలను బెంగాల్ సీఎం కూడగడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో బలమైన ప్రత్యర్థిని బరిలో నిలిపేందుకు మమత బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో నిర్వహించే భేటీకి 22 మంది నేతలకు ఆహ్వానం పంపారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్ సీఎంలతో పాటు పలువురి ప్రముఖులకు లేఖలు రాశారు.

18న ఓటింగ్
రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్‌ను ఈ నెల 15న జారీ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. జూన్ 15 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, 30న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. జులై 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన పోలింగ్‌ను జులై 18న నిర్వహిస్తామని.. జులై 21న ఓట్ల లెక్కిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications