ఆ యూనివర్సిటీలకు యూజీసీ షాక్.. పీహెచ్.డీలపై నిషేధం!
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 3 యూనివర్సిటీలకు షాక్ ఇచ్చింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని పిహెచ్డి డిగ్రీల కోర్సులను నిర్వహిస్తున్న మూడు యూనివర్సిటీల పైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని మూడు యూనివర్సిటీలు నిర్వహించే పీహెచ్డీ డిగ్రీల ప్రోగ్రాం ల పైన ఐదు సంవత్సరాల పాటు నిషేధం విధించింది.
పీహెచ్డీ ప్రోగ్రాం లపై యూజీసీ కీలక నిర్ణయం
ఇక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చిన ఈ ఉత్తర్వులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులో ఉంటాయని పేర్కొంది. సహజంగా యూనివర్సిటీలలో పిహెచ్డి ప్రోగ్రామ్ అంటే ఒక కొత్త అన్వేషణ, ఒక కొత్త సిద్ధాంత గ్రంథ ఆవిష్కరణ.. దీనికోసం విద్యార్థులు నిర్ణీత కాలవ్యవధిలో పరిశోధన చేయాల్సి ఉంటుంది. తమ పరిశోధనలో కొత్త ఆవిష్కరణ చేసి యూనివర్సిటీ ముందు తమ సిద్ధాంత గ్రంధాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

స్టాండర్డ్స్ లేకుండా పీహెచ్ డీ లు
అయితే ప్రమాణాలు పాటించకుండా అసలు పీహెచ్బీ స్టాండర్డ్స్ లేకుండా కొన్ని యూనివర్సిటీలు పిహెచ్డి ప్రోగ్రాం లను నిర్వహిస్తున్నాయి. టాపిక్ సెలక్షన్ నుండి రీసెర్చ్ వరకు ఎటువంటి ప్రమాణాలు లేని పీహెచ్డీ సిద్ధాంత గ్రంథాలు, ఎందుకు ఉపయోగపడవని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ భావిస్తోంది. అందుకే దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
ఆ యూనివర్సిటీల పీహెచ్ డీ ప్రోగ్రామ్స్ పై నిషేధం
ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఇటువంటి ప్రమాణాలు లేని పిహెచ్డి విద్యా విధానాన్ని గమనించిన యూజీసీ రాజస్థాన్ రాష్ట్రంలోని మూడు యూనివర్సిటీల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐదేళ్లపాటు ఆ యూనివర్సిటీలలో పిహెచ్డి ప్రోగ్రాం ల పైన నిషేధం విధించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎవరు ఆ యూనివర్సిటీలలో పిహెచ్డి ప్రోగ్రాంలలో చేరకూడదని ఒకవేళ చేరినా అవి చెల్లదని ప్రకటించింది.
కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
ఓపిజేఎస్, అల్వార్ లోని సన్ రైజ్, ఝన్ ఝునా లోని సింఘానియా యూనివర్సిటీలో ఆఫర్ చేసే పిహెచ్డి ప్రోగ్రామ్స్ లో ఎవరు చేరవద్దని అవి చెల్లవని హెచ్చరించింది. పీహెచ్డీల విషయంలో ఎవరైనా సరే ప్రమాణాలు పాటించకపోతే ఇదే తరహా చర్యలు తీసుకుంటామని దేశవ్యాప్తంగా ఉన్న మిగతా యూనివర్సిటీలకు కూడా ఈ చర్య ద్వారా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ క్రమంలో నైనా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో పీహెచ్డీ ల విషయంలో ప్రమాణాలు మెరుగుపడతాయని విద్యావేత్తలు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications