ఇదేం ట్విస్ట్ రా మావా.. పెళ్లికి ముందు వధువు తండ్రితో వరుడు తల్లి జంప్..!
పెళ్లికి ముందు వధువు తండ్రితో వరుడి తల్లి పరారైన ఘటన నెట్టింట హల్ చల్ చేస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఎంగేజ్ మెంట్ జరగాల్సి ఉండగా ఈ లోపే వధువు తండ్రితో వరుడు తల్లి పారిపోవడంతో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ కు గురయ్యారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినిలో జరిగింది. పిల్లల పెళ్లికి ముందు పెద్దలు ఇలా చేయడంపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన ఏడు రోజులకు మిస్ అయిన మహిళను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
తమ పిల్లలకు ఇరు కుటుంబాలు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాయి. ఫలానా తేదీ పెళ్లి పెట్టుకున్నాయి. వారం రోజుల్లో నిశ్చితార్థం నిర్వహించాలని ఇరు కుటంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వారికి బిగ్ షాక్ తగిలింది. వధువు తండ్రితో వరుడి తల్లి పారిపోయింది. దీంతో ఇరు కుటుంబాలు, బంధువులు నోరు వెళ్లబెట్టారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వార్త వైరల్ అయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్లి గ్రామానికి చెందిన 50 ఏళ్ల రైతు.. కొన్నేళ్ల క్రితం తన భార్యను కోల్పోయాడు. ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఉంటాసా గ్రామానికి చెందిన ఓ మహిళ కుమారుడితో అతడి కూతురికి ఇటీవల పెళ్లి కుదిరింది. పెళ్లి సంబంధం, ఆ తర్వాత నిశ్చితార్థం కార్యక్రమాల్లో భాగంగా వరుడి తల్లికి, వధువు తండ్రికి పరిచయం కాస్త ముదిరింది. దీంతో ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడటం స్టార్ట్ చేశారు. అలా మరి కొన్ని రోజుల్లో నిశ్చితార్థం జరుగుతోంది అనగా.. వీళ్లిద్దరూ ఎక్కడికో పారిపోయారు. దీంతో ఇరు వర్గాల కుటుంబాలు, బంధువులు షాక్ తిన్నాయి.

అయితే వరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో చిక్లి గ్రామంలో ఆ రైతు వద్దే మహిళ ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఇంటికి రావాలని బంధువులు ఒప్పించేందుకు యత్నించగా.. ఆమె రైతుతోనే ఉంటానని తెగేసి చెప్పడంతో వాళ్లంతా షాక్ తిన్నారు. ఈ ఘటనతో ఇరు వర్గాల కుటంబాలకు ఏం చేయాలో తెలియడం లేదు. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications