ఢిల్లీలో కరోనా ప్రళయానికి 2కారణాలు -యూకే వేరియంట్, డబుల్ మ్యూటేషన్ వల్లే: ఎన్‌సీడీసీ
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని, స్వల్ప వ్యవధిలోనే భారీ స్థాయిలో కేసులు, మరణాలు పెరగడానికి యూకే వేరియంట్ కరోనా స్ట్రెయిన్, డబుల్ మ్యూటేషన్ కరోనాలే కారణమని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) నిపుణులు తెలిపారు. మార్చి నెలలో జరిపిన శాంపిళ్ల విశ్లేషణలో 50శాతం కేసులు బ్రిటన్ వేరియంట్‌వే కావడం ఇందుకు నిదర్శనమని వారు అన్నారు.
దేశంలో కరోనా వైరస్ పరివర్తనలు, వాటి ప్రభావాన్ని అంచనా వేసేందుకు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మార్చి రెండు, నాలుగు వారాల్లో ఢిల్లీలో కరోనా సోకిన వారి నమూనాలకు పరిశీలించారు.

రెండో వారంలో చేపట్టిన నమూనాల్లో 28శాతం యూకే వేరియంట్ బయటపడగా.. అదే నెల చివరి వారంలో అవి 50శాతానికి పెరిగాయని ఎన్‌సీడీసీ డైరెక్టర్ సుజీత్ సింగ్ వెల్లడించారు. తద్వారా ఢిల్లీలో వైరస్ విలయతాండవానికి యూకే వేరియంట్ కారణమై ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ముఖ్యంగా పంజాబ్‌లో బ్రిటన్ రకం వైరస్ ప్రభావమే అత్యధికంగా ఉందని సుజీత్ సింగ్ పేర్కొన్నారు.
ఢిల్లీలో ఇప్పటివరకు 15వేల నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ (INSACOG కన్సార్టియం ఆధ్వర్యంలో) చేపట్టినట్లు ఎన్‌సీడీసీ చీఫ్ వెల్లడించారు. వీటిలో ప్రస్తుతం రెండు రకాల (B.1.617, యూకే) కరోనా వేరియంట్‌లను గుర్తించామన్నారు. మహారాష్ట్రలో వెలుగుచూసిన B.1.617 వేరియంట్‌నే డబుల్ మ్యుటేషన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న చాలా నగరాల్లో ఈ రకం వేరియంట్ కేసులే 50శాతం వెలుగుచూస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications