అక్రమ సంబంధం, ఇంట్లో చిత్రహింసలు, పిల్లలతో కలిసి భార్య ఏం చేసిందంటే ?, పక్క రాష్ట్రంలో !
కుటుంబ సభ్యులు, బంధువులు నిశ్చయించిన పెళ్లి చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత దంపతులు చక్కగా సంసారం చెయ్యడంతో ఇద్దరు పిల్లలు పుట్టారు. అక్రమ సంబంధం కారణంగా భర్తతో గొడవపడిన భార్య ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే సందర్బంలో ముగ్గురు శవాలై కనిపించడం కలకలంరేపింది.

ఇద్దరు కూతుళ్లతో కలిసి కన్న తల్లి భర్త వేధింపులతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని బెళగావి జిల్లా రాయబాగ్ తాలూకా సుల్తాన్‌పూర్ గ్రామ శివారులో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కూతుళ్లతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. సరస్వతి కిరవే అలియాస్ సరస్వతి (26) అనే మహిళ ఆమె పిల్లలు దీపికా (7), రితిక (4) బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన కిరాణ్ అనే యువకుడికి సరస్వతికి పెళ్లి చెయ్యాలని ఇరువైపుల కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. 2016లో కుటుంబ సభ్యులు నిర్ణయించిన ముహూర్తానికి కిరణ్, సరస్వతిల వివాహం అయ్యింది. అయితే కిరణ్ కు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని తెలిసింది. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న కిరణ్ తరువాత ఇంటికి వెళి అతని భార్య సరస్వతిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి,
చాలా కాలం నుంచి కిరణ్ అతని భార్య సరస్వతిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని తెలిసింది. భర్త కిరణ్ వేధింపులతో విసిగి వేసారిన సరస్వతి ఆమె స్వగ్రామమైన బెళగావి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌కు వెళ్లిపోయింది. జీవితంపై విరక్తి పెంచుకున్న సరస్వతి ఆమె ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బావిలోంచి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

మృతురాలు సరస్వతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త కిరణ్ నిత్యం ఇంట్లో సరస్వతిని టార్చర్ పెట్టాడని, అతని వేధింపులకు విసిగిపోయి సరస్వతి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. 8 నెలల క్రితం భర్త కిరణ్ తో గొడవ పడిన సరస్వతి పుట్టింటికి తిరిగి వచ్చిందని, అప్పటి నుంచి భార్యాపిల్లలను చూసేందుకు భర్త ఒక్కరోజు కూడా సరస్వతి ఇంటికి వచ్చే ప్రయత్నం చేయలేదు. తరచూ ఫోన్ చేసి వేధించేవాడని, దీంతో మనస్తాపానికి గురైన సరస్వతి ఆమె పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హారూగేరి పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications