250 మంది ఆంటీలు, అమ్మాయిలను మోసం చేసిస నరేష్ అంకుల్, వీడి టార్గెట్ ఎలా అంటే?

దేశంలోని లక్షలాది మంది యువతీ యువకులు తమ జీవిత భాగస్వామిని వెతకడానికి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లకు లాగిన్ అవుతారు. అయితే ఓ అంకుల్ అతని 25 ఏళ్ల క్రితం నాటి ఫోటోను మ్యాట్రిమోనీ సైట్‌లో పోస్ట్ చేశాడు. మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ఖాతా తెరిచి ఏకంగా 250 మంది మహిళలు, యువతులను మోసం చేసిన ఉదంతం వెలుగులోకి రావడంతో పోలీసులు బిత్తరపోయారు.

మనం కళ్లతో చూసే అబ్బాయిలను, అమ్మాయిలను నమ్మలేని తరుణంలో మ్యాట్రిమోనీ సైట్‌లో కనిపించే అబ్బాయికి లేదా అమ్మాయికి పెళ్లి చేసేముందు ఒకటికి వందసార్లు ఆలోచించి, వాళ్లలో నిజానిజాలు తెలుసుకుని ముందుకెళ్లాలి. లేకుంటే చేతిలో ఉన్న డబ్బు, శీలం పోగొట్టుకుని మోసపోతారు అని చెప్పడానికి ఇలాంటి నరేష్ పూరి గోస్వామి అంకుల్ స్టోరీ చక్కటి ఉదాహరణ. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లు మంచి ఉద్దేశ్యంతో ప్రారంభించబడినప్పటికీ, వాటిని దుర్వినియోగం చేసే కిలాడీలు కూడా చాలా మంది ఉన్నారు.

Uncle who cheated 250 women by opening fake accounts in matrimony

కాబట్టి మ్యాట్రిమోనీలో పెళ్లి సంబంధాలు చూసుకునే ముందు అందరూ చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. 250 మంది మహిళలను, యువతులను పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తున్న నిందితుడు నరేష్ పూరి గోస్వామిని బెంగళూరు సిటీ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో నకిలీ ఖాతాలు సృష్టించిన నరేష్ పూరి గోస్వామి అలియాస్ నరేష్ అనేక మందిని మోసం చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్ చేసుకున్న నరేష్ పూరి గోస్వామి అంకుల్ వారిని నిలువునా మోసం చేయడం అతని డ్రీమ్ అని పోలీసులు తెలిపారు.

నేను ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారిగా మహిళలను మోసం చేస్తున్న నరేష్ పూరి గోస్వామిపై ఆరోపణలు వచ్చాయి.పెళ్లి చర్చల కోసం నరేష్ కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు ఓ మహిళను పిలిపించాడు. ఆ తర్వాత టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకోవాలని, డబ్బులు తరువాత వస్తాయని, తన పర్స్ ఇంట్లోనే మరిచిపోయి వచ్చానని ఆమెకు నరేష్ మాయమాటలు చెప్పాడు. నిందితుడు బ్లాక్‌లో రెండు సిమ్‌కార్డులు కొనుక్కొని వాటిని వాడుతున్నాడని పోలీసులు తెలిపారు.

ఓ హిందీ దినపత్రికల్లో పెళ్లి చేసుకోవడానికి ప్రకటనలు (యాడ్స్) ఇచ్చిన మహిళలను గుర్తించి వారి ఫోన్ నెంబర్లు సేకరించిన నరేష్ ఆతర్వాత వారితో ఫోన్‌లో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పోలీసుల విచారణలో రాజస్థాన్‌కు చెందిన 56 మంది మహిళలు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 32 మహిళలు, ఢిల్లీకి చెందిన 32 మంది మహిళలు, కర్ణాటకకు చెందిన 17 మంది మహిళలు, మధ్యప్రదేశ్‌కు చెందిన 16 మంది మహిళలు, మహారాష్ట్రకు చెందిన 13 మంది మహిళలు, గుజరాత్‌కు చెందిన 11 మంది మహిళలను మోసం చేసినట్లు వెలుగు చూసింది. ఇంకా చాలా మంది మహిళలు, యువతులను నరేష్ మోసం చేసినట్లు సమాచారం ఉందని, అయితే ఆ విషయాలు ఇంకా వెలుగులోకి రాలేదని బెంగళూరు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+