ఇక టీసీఎస్ దూకుడు: దశాబ్దం తర్వాత భారీ పునర్ వ్యవస్థీకరణ

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్) కొత్త నాయకత్వంలో సరికొత్త మార్పులను చేసుకుంటోంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత టీసీఎస్ భారీ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టింది. తమ సర్వీస్ లైన్స్ పునర్ వ్యవస్థీకరించి, వాటికి అధినేతగా కృషన్నన్ రామానుజంను నియమించింది. దీంతో బిజినెస్ టెక్నాలజీ సర్వీసుల అధినేతగా రామానుజం బాధ్యతలు చేపట్టారు.

దశాబ్ద కాలం తర్వాత..

దశాబ్ద కాలం తర్వాత..

అంతేగాక, వ్యాపార అధినేతలను కూడా టీసీఎస్ మార్చేసింది. డిజిటల్ ఆఫర్స్‌ను వృద్ధి చేయడానికి టీసీఎస్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 2009లో కొత్త సీఈఓగా ఎన్ చంద్రశేఖరన్ నియామకమైనప్పుడు కంపెనీలో భారీ మార్పులు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఎలాంటి పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ జరగకపోవడం గమనార్హం.

వేగవంతంగా..

వేగవంతంగా..

ప్రస్తుతం చంద్రశేఖరన్ టాటా గ్రూప్ ఛైర్మన్‌గా పదోన్నతి పొందడంతో ఆయన స్థానంలో టీసీఎస్ కొత్త సీఈఓగా రాజేష్ గోపీనాథన్ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచమంతా వేగవంతంగా డిజిటల్‌లోకి మారుతున్న తరుణంలో డిజిటల్ తరహాలోనే కొత్త వ్యాపారాలపై దృష్టి సారించాలని టీసీఎస్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే పునర్ వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది.

డిజిటల్ వ్యాపారం

డిజిటల్ వ్యాపారం

2017 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ డిజిటల్ బిజెనెస్‌లు 28శాతం పెరిగాయి.. కంపెనీ ఆదాయాల్లో 16శాతం ఇవే ఆక్రమించుకోవడం గమనార్హం. ఐటీ ఇండస్ట్రీస్ బాడీ నాస్కామ్ డేటా ప్రకారం.. 155 బిలియన్ డాలర్ల ఇండస్ట్రీ రెవెన్యూల్లో డిజిటల్ వ్యాపారాల శాతం 14శాతం ఉన్నట్లు తెలిసింది.

మరింత దూకుడు

మరింత దూకుడు

కాగా, కంపెనీ పునర్ వ్యవస్థీకరణ కంపెనీని మరింత చురుకుగా తయారు చేస్తుందని ఈ సందర్భంగా రామానుజం తెలిపారు. యంగల్ లీడర్స్ కు అవకాశాలు పెరుగుతాయన్నారు. మొత్తంగా అన్ని సర్వీసుల లైన్స్‌ను కలిపి ఒక మెగా యూనిట్‌గా టీసీఎస్ రూపొందించింది. అదే బిజినెస్ టాక్నాలజీ సర్వీసులు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In its first major restructuring exercise in close to a decade, India's largest IT services company Tata Consultancy ServicesBSE 0.32 % (TCS) has reorganised its service lines and put them under a new president, Krishnan Ramanujam.
Please Wait while comments are loading...