అంబానీ పెళ్లిలో అతిథులకు ఊహించని బహుమతులు
ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట మూడురోజులపాటు పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి. దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలంతా ఈ వివాహానికి తరలివస్తున్నారు. ముంబయిలోని వీధులన్నీ అతిథులతో నిండిపోయాయి. ఈరోజు జరిగే వేడుకలో ముకేశ్ అంబానీ - నీతా అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ.. రాధిక మర్చంట్ ను వివాహం చేసుకోబోతున్నారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా వీరిద్దరి వివాహం జరగనుంది. వీరి వివాహానికి ముకేశ్ అంబానీ దాదాపు రూ.5వేల కోట్లు ఖర్చుచేయనున్నారు.
అతిథులకు భారీగా సత్కారాలు
మూడురోజులపాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా 13వ తేదీన శుభప్రదమైన ఆశీర్వాదం, 14వ తేదీన వివాహ రిసెప్షన్, చివరి రోజు మంగళ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. అతిథులకు విందు వినోదాలతోపాటు వినోద కార్యక్రమాలకు కలిపి వందల కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నారు. దాదాపుగా 2500 మంది ముఖ్యఅతిథులుగా వస్తున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు ముకేశ్ అంబానీ మూడు ఫాల్కన్ జెట్స్ (2000) అద్దెకు తీసుకున్నారు. అతిథులకు వీరి స్థాయికి తగినట్లు భారీగా సత్కారాలు చేయనున్నారు.

కుమారుడు అనంత్ అంబానీ పెళ్ళిలో ముకేశ్ అంబానీ కుటుంబం #MukeshAmbani #AnantRadhikaWedding #AnantAmbani #RadhikaMerchant #AnantAmbaniRadhikaMerchant #Oneindiatelugu pic.twitter.com/F3Me4uQptK
— oneindiatelugu (@oneindiatelugu) July 12, 2024
బహుమతిగా గడియారం
అతిథులకు స్వాగత సత్కారాలతోపాటు వీడ్కోలు కూడా ఘనంగా ఉండేటట్లు చూస్తున్నారు. అన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. గెస్ట్ లకు కోట్ల రూపాయల విలువైన బహుమతులను అందజేయబోతున్నారు. వీవీఐపీ అతిథులకు రిటర్న్ గిఫ్ట్ లో గడియారాలను ఇస్తున్నారు. ఒక్కోటి కోట్ల రూపాయలు విలువ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర అతిథులకు రాజ్ కోట్, కశ్మీర్, బెనారస్ నుంచి ప్రత్యేకంగా ఆర్డర్ చేసిన బహుమతులను అందివ్వనున్నారు. అనంత్ అంబానీ - రాధిక పెళ్లి మెనూ చాలా ప్రత్యేకంగా ఉంది. దాదాపు మూడువేల వంటకాలున్నాయి. అంతర్జాతీయ చెఫ్ లు వీటిని వండుతున్నారు. 100కు పైగా వంటకాలను ఇండోనేషియా క్యాటరింగ్ కంపెనీల చేత చేస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications