కశ్మీర్ మానవ హక్కులపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి...!
కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై అంతర్జాతీయంగా మరోసారి చర్చకు తెరలేసింది. గత కొద్ది రోజులుగా కశ్మీర్ లో కొనసాగుతున్న సంఘటనలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీరీల ఇంటర్‌నెట్ కమ్యూనికేషన్లపై నిబంధనలు విధించడంతో పాటు శాంతియుత సమావేశాలను నిషేధించడం, మరియు స్థానిక రాజకీయ నాయకులను, కార్యకర్తలను నిర్భంధించడంపై యూఎన్ మానవ హక్కుల మండలి అధ్యక్షురాలు మిచెల్లి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
అంతర్జాతీయ మానవ హక్కుల మండలి 42వ సమావేశం జనీవాలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో అధ్యక్షురాలు మిచెల్లీ మాట్లాడారు. ఈనేపథ్యంలోనే ఆమే కశ్మీర్‌లో ఉన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా కశ్మీర్‌లో మానవ హక్కులను భారత దేశంతో పాటు, పాకిస్థాన్ దేశాలు కాపాడాలని కోరుతున్నానని చెప్పారు. మరోవైపు కశ్మీర్‌లో నెలకొన్న నిర్భంధాలతో పాటు కర్ఫ్యూను ఎత్తి వేయాలని ఆమే భారత్‌కు విజ్ఞప్తి చేశారు. కశ్మీరీల భవిష్యత్తుపై ప్రభావం చూపే ఏ నిర్ణయాలైనా తీసుకునేటప్పుడు వారిని పూర్తిగా భాగస్వామ్యులు చేయడం చాల ముఖ్యమని ఆమే ఆన్నారు. నిర్భంధంలో ఉన్న వారితోపాటు ప్రజలకు ప్రాధమిక హక్కులను కల్పించడం అత్యంత అవసరమని సూచించారు.

కాగా గత ముప్పై 36 రోజులుగా కశ్మీర్‌లో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం పలు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే.అయితే ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో దశల వారిగా ఆంక్షలను సడలింపు చేస్తోంది. ఇందులో భాగంగానే పలు ప్రాంతాల్లో కర్ఫూను తొలగించడంతోపాటు సాధరణ పరిస్థితులను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.
-
ఆంజనేయుడి దివ్యమంత్రం -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!!












Click it and Unblock the Notifications