మణిపూర్ లో మళ్లీ అరాచకం, రాత్రిపూట వెళ్లి ఇళ్లకు నిప్పు, తుపాకి కాల్పులతో హడల్ !
మణిపూర్//ఇంఫాల్: మణిపూర్ లో హింసను అరికట్టడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. మణిపూర్ (manipur)లో అల్లర్లు అదుపులోకి వచ్చినట్లు వచ్చి మళ్లీ హింసకు దారితియ్యడంతో అధికారులు హడలిపోతున్నారు. మణిపూర్ పోలీసులతో పాటు సైనికులు రంగంలోకి దిగి కొన్ని నెలల నుంచి మణిపూర్ లో (imphal) పరిస్థితిని అదుపులోకి తీసుకురాలని ప్రయత్నిస్తున్నారు.
బుధవారం రాత్రి పోద్దుపోయిన తరువాత మణిపూర్ (manipur) రాజధాని ఇంఫాల్ (imphal) జిల్లాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత ఇంఫాల్ (imphal) జిల్లాలోని కీతల్మనబి ప్రాంతంలో మొదట రెండు ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో అల్లర్లు మొదలైనాయి. ఆ గొడవలతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు.

రెండు ఇళ్లకు నిప్పంటించడంతో నివాసాలు కాలి బూడిద అయ్యాయని పోలీసులు అన్నారు. ఇళ్లకు నిప్పు పెట్టిన తరువాత కొందరు తుపాకీలతో కాల్పులు జరిపారని సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు స్థానిక మీడియాకు చెప్పారు. గురువారం కూడా ఆ ప్రాంతంలో తుపాకి కాల్పులు శభ్దాలు వినిపించడంతో స్థానిక ప్రజలు హడలిపోయారు.
ముందు జాగ్రత్తగా చర్యగా ఇంఫాల్ (imphal) జిల్లాలోని సున్నితమైన ప్రాంతాలకు అదనపు పోలీసు బలగాలను తరలించామని పోలీసు అధికారులు తెలిపారు. మణిపూర్ లో (manipur)మే 3వ తేదీన కుకీలు, మైతేయి కులాల మధ్య చిచ్చు రేగడంతో మొదలైన హింస నేటికి అదుపులోకి రాలేదు. మణిపూర్ లో జరిగిన హింస కారణంగా ఇప్పటి వరకు 180 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని అధికారులు అంటున్నారు. మణిపూర్ (manipur)పోలీసులతో పాటు ఆర్మీ కూడా మణిపూర్ లో అల్లర్లను అదుపు చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం చిక్కడం లేదని అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications