Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Budget 2020 : అసలు బడ్జెట్ అంటే ఏంటి.. అందులోని కీలక అంశాలేంటి..?

Recommended Video

    #Budget2020 : Nirmala Sitharaman Arrives At Parliament With 'Bahi Khata'

    కేంద్ర బడ్జెట్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొద్ది గంటల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ గురించి చర్చ వచ్చినప్పుడల్లా ద్రవ్య లోటు,పన్ను వసూళ్లు,జీఎస్టీ,జీడీపీ తదితర పదాలు ప్రస్తావనకు వస్తుంటాయి. సామాన్యులను ఇవి కాస్త గందరగోళానికి గురిచేసే అంశాలు. ఈ నేపథ్యంలో స్థూలంగా అసలు బడ్జెట్ అంటే ఏంటో తెలుసుకుందాం..

    బడ్జెట్ అంటే..

    బడ్జెట్ అంటే..

    భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ అంటే వార్షిక ఆర్థిక నివేదిక లేదా ప్రభుత్వ ఆదాయ,వ్యయాలకు సంబంధించి ప్రభుత్వం చేసే ప్రకటన. ఏప్రిల్ 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు జరిగే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థికపరమైన వివరాలన్నింటిని ప్రభుత్వం బడ్జెట్‌లో పొందుపరుస్తుంది. కేంద్ర బడ్జెట్‌ను రెవెన్యూ బడ్జెట్,మూలధన బడ్జెట్‌(కేపిటల్ బడ్జెట్)గా వర్గీకరించారు.

    రెవెన్యూ బడ్జెట్..

    రెవెన్యూ బడ్జెట్..

    రెవెన్యూ బడ్జెట్‌లో ప్రభుత్వ ఆదాయ, ఖర్చుల వివరాలు ఉంటాయి. అలాగే పన్ను, పన్నుయేతర రాబడి వివరాలు ఉంటాయి. రెవెన్యూ వ్యయం గురించి సింపుల్‌గా చెప్పాలంటే.. ప్రభుత్వ నిర్వహణకు రోజువారీ అయ్యే ఖర్చు, పౌరులకు అందించే వివిధ సేవలకు అయ్యే ఖర్చు అన్నమాట. ఒకవేళ రెవెన్యూ ఖర్చు రెవెన్యూ ఆదాయం కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్నట్టుగా పరిగణించాలి.

    మూలధన బడ్జెట్..

    మూలధన బడ్జెట్..

    మూలధన బడ్జెట్‌లో మూలధన వసూళ్లు,వ్యయం ఉంటాయి. ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించే రుణాలు, రిజర్వ్‌బ్యాంకు నుంచి తీసుకునే అప్పులు, ట్రెజరీ బిల్లులు, విదేశాల నుంచి వెనక్కి తీసుకునే పెట్టుబడులు, చిన్నమొత్తాల పొదుపు, సెక్యూరిటీలు, ప్రావిడెంట్‌ ఫండ్లు, ప్రత్యేక డిపాజిట్లు మూలధన వసూళ్లలో ప్రధాన భాగం. ఇక మూలధన వ్యయంలో యంత్రాలు, పరికరాలు, భవనం, ఆరోగ్య సౌకర్యాలు, విద్య,షేర్లు, పెట్టుబడులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు, తదితరులకు ఇచ్చే రుణాలు, గ్రాంట్లు, అడ్వాన్సులు మొదలైన వాటి అభివృద్ధికి అయ్యే ఖర్చు వంటివి ఉంటాయి. ప్రభుత్వ మొత్తం వ్యయం మొత్తం ఆదాయాన్ని మించినప్పుడు ద్రవ్య లోటు ఏర్పడుతుంది.

    వ్యయంలో రెండు రకాలు..

    వ్యయంలో రెండు రకాలు..

    కేంద్ర ప్రభుత్వ వ్యయం ప్రధానంగా రెండు భాగాలు. 1) ప్రణాళికా వ్యయం. 2) ప్రణాళికేతర వ్యయం. ప్రణాళికా సంఘం, మంత్రిత్వ శాఖలతో చర్చల తర్వాత ప్రణాళిక వ్యయం ప్రతిపాదనలను ఖరారు చేస్తుంది. దేశ అభివృద్దికి ఉపయోగపడే ఖర్చుగా దీనిని పరిగణిస్తారు. రుణాలపై వడ్డీ చెల్లింపులు, ఆహారం, ఎరువులపై ఇచ్చే సబ్సిడీలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గ్రాంట్లు, పెన్షను, వివిధ రంగాల్లో భద్రత, ఆర్థిక సేవలు, పన్నుల వసూళ్లు తదితర అంశాలు ప్రణాళికేతర వ్యయంలో ఉంటాయి.

    బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడుతారు..

    బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడుతారు..

    గతంలో ఫిబ్రవరి చివరి పని దినం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. 2017 నుంచి ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. గత బడ్జెట్‌ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామనే ప్రవేశపెట్టారు. తాజా బడ్జెట్‌ను కూడా ఆమెనే ఆవిష్కరించనున్నారు. కొత్త బడ్జెట్‌ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+