UNION BUDGET 2022: ఐదేళ్ళలో 60లక్షల ఉద్యోగాలు; 4మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు: నిర్మలాసీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈసారి చేనేత చీరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ రాబోయే 25 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ను రూపొందించామని నిర్మల సీతారామన్ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఘడియల్లో ఉన్నామని, మరో 25 సంవత్సరాల విజన్ తో తమ ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించిందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ తో పునాది వేశామని నిర్మలమ్మ తెలిపారు.
Recommended Video

ఐదేళ్ళలో 60 లక్షల ఉద్యోగాల కల్పన
సవాళ్ళను ఎదుర్కొనే స్థితిలో ఉన్నామని తెలుగు నిర్మల సీతారామన్, డిజిటల్ ఎకానమీ ని ప్రమోట్ చేస్తున్నామని చెప్పారు. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్ తో 16 సెంటర్లలో 60 లక్షల ఉద్యోగాలను కల్పించబోతున్నామని, దేశంలో యువతకు ఉద్యోగాలు కల్పనపై ప్రధానంగా ఫోకస్ చేశామని నిర్మల సీతారామన్ తెలిపారు. రానున్న ఐదు సంవత్సరాలలో 60 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని నిర్మల సీతారామన్ వెల్లడించారు.కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని, వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ బాగా పనిచేస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

నేషనల్ హైవేస్ నెట్వర్క్ ను 25 వేల కిలోమీటర్ల మేర పెంపు , 4 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు
దేశంలో నాలుగు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లుగా నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సాంకేతిక ఆధారిత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నిర్మల సీతారామన్ తెలిపారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు. నేషనల్ హైవేస్ నెట్వర్క్ ను 25 వేల కిలోమీటర్ల మేరకు పెంచుతామని, ఇందుకు 20 వేల కోట్లు సమీకరిస్తున్నామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. మొత్తం నాలుగు అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అందులో మొదటిది పిఎం గతిశక్తి అని నిర్మలమ్మ స్పష్టం చేశారు.

పీఎం గతి శక్తి ద్వారా మౌలిక సదుపాయాల కల్పన
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల్లో ముందంజలో ఉన్నామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ. 20వేల కోట్లు కేటాయించామని ప్రకటించారు. ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాల ద్వారా 14 రంగాల్లో మంచి అభివృద్ధి కనిపించిందన్నారు నిర్మలా సీతారామన్ .
వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు నిర్మలమ్మ . నీలాంచల్ నిస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను ప్రైవేటు పరం చేశామని పేర్కొన్నారు. త్వరలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ రాబోతుందన్నారు.ఎయిరిండియా బదిలీని పూర్తి చేసినట్లుగా ఆర్థిక మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications