వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ బిగ్ స్కెచ్- ఏపీ సహా: 12 రోజుల పాటు..!!

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఇవ్వాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ పై బీజేపీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. ఇవ్వాళ మొదలు కానున్న ఈ క్యాంపెయిన్ 12 రోజుల పాటు కొనసాగుతుంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ ప్రజలందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తోన్న వార్షిక బడ్జెట్.. ఇంకాస్సేపట్లో వెలువడనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ (Budget 2023) ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. గత రెండేళ్ల తరహాలోనే ఇది కూడా పేపర్ లెస్ బడ్జెట్. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల మధ్య 2021లో కేంద్ర ప్రభుత్వం పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అదే ఆనవాయితీని ఇప్పుడూ కొనసాగిస్తోంది.

ఫ్రీ డౌన్ లోడ్..

ఫ్రీ డౌన్ లోడ్..

బడ్జెట్ ప్రతిపాదనలన్నింటినీ సామాన్య పౌరులకు అందుబాటులో ఉంచింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ మొబైల్ యాప్, వెబ్ సైట్ లో పొందుపర్చనుంది. యూబీ (యూనియన్ బడ్జెట్) అనే యాప్ ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆధారంగా నడిచే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే indiabudget.gov.in అనే వెబ్‌ సైట్ ను కూడా సందర్శించవచ్చు.

దేశవ్యాప్తంగా..

దేశవ్యాప్తంగా..

దీనితో పాటు ఈ ఏడాది కొత్తగా ప్రచార కార్యక్రమాలను కూడా తెరమీదికి రాబోతోన్నాయి. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా బడ్జెట్ గురించి ప్రచారం చేయబోతోంది. ఈ మధ్యాహ్నం నుంచి ఈ క్యాంపెయిన్ ఆరంభం కానుంది. 12 రోజుల పాటు కొనసాగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు బీజేపీ శ్రేణులన్నీ. వీలైన చోట్ల పవర్ పాయింట్ ప్రజంటేషన్లు కూడా ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.

ప్రత్యేకంగా కమిటీ..

ప్రత్యేకంగా కమిటీ..


ఈ కార్యక్రమాలన్నింటినీ కోఆర్డినేట్ చేయడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా నియమించింది బీజేపీ హైకమాండ్. తొమ్మిది మంది సభ్యులు ఉండే ఈ కోఆర్డినేషన్ కమిటీకి బిహార్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ సారథ్యం వహిస్తారు. బ్లాక్, బూత్ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందంటూ ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్ని రాష్ట్రాల బీజేపీ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు.

 అనుబంధ సంస్థలన్నీ..

అనుబంధ సంస్థలన్నీ..

బీజేపీ అనుబంధ సంస్థల సేవలన్నింటినీ వినియోగించుకోవాల్సి ఉంటుంది. కిసాన్ మోర్చా, మహిళా మోర్చా, విద్యార్థి విభాగాలు, మండలస్థాయి నాయకులను ఇందులో భాగస్వామ్యం కల్పించనున్నారు. బడ్జెట్ లో ప్రతిపాదించిన అంశాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేలా దీన్ని డిజైన్ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా కొన్ని వాహనాలు, డిజిటల్ క్యాంపెయిన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.

కేంద్రం వాటా..

కేంద్రం వాటా..

రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాల్లో కేంద్రం వాటా, నిధుల కేటాయింపు.. వంటి అంశాలను జనంలోకి తీసుకెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ ఏడాది తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ, 2024లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- బడ్జెట్ పై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేక భావం కలగకుండా ఉండేలా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

English summary
BJP will launch a 12-day countrywide campaign on February 1 to inform people about the upcoming Union Budget 2023-24 and the benefits it will bring.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X