కేంద్ర బడ్జెట్‌లో ఆ దంపతులకు బిగ్ రిలీఫ్?
Union Budget 2025: ఇంకొద్ది రోజుల్లో వార్షిక బడ్జెట్.. పార్లమెంట్ ముందుకు రానుంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. బడ్జెట్ ప్రతిపాదనలను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనపై కసరత్తు సాగుతోంది. దీనికి ప్రారంభ సూచికగా హల్వా కార్యక్రమం ముగిసింది కూడా.
పన్నుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందనేది బహిరంగ రహస్యమే. దేశంలో ట్యాక్స్ టెర్రరిజం కొనాగుతోందని, నానా రకాలుగా ట్యాక్సులను వసూలు చేస్తోన్నారంటూ మొన్నటికి మొన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆరోపణలు గుప్పించారు.

సంవత్సరానికి 10 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న మధ్య తరగతి ప్రజలు లెక్కలేనని పన్నులను చెల్లించాల్సి వస్తోందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. టీచర్లు, లాయర్లు, వేతన జీవులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు విపరీతంగా పన్నులను చెల్లిస్తోన్నారని, ఇది ట్యాక్స్ టెర్రరిజమని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో ఆయన కొన్ని డిమాండ్లను కేంద్రం ముందు పెట్టారు. విద్యపై ప్రతిపాదించే బడ్జెట్ మొత్తాన్ని రెండు నుండి 10 శాతానికి పెంచడం, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించడం, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యకు సబ్సిడీలను ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు.
ఆరోగ్య బడ్జెట్‌ను 10 శాతానికి పెంచండం, హెల్త్ ఇన్సూరెన్స్‌పై పన్నులను పూర్తిగా తొలగించడం, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని అన్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తొలగించండంతో పాటు సీనియర్ సిటిజన్ల కోసం పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలనీ డిమాండ్ చేశారు.
ఇక తాజాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఓ ప్రతిపాదను కేంద్రం ముందు పెట్టింది. దంపతులకు ఉమ్మడి పన్నును ప్రవేశపెట్టాలని కోరింది. ఉమ్మడి పన్ను కింద- భార్యభర్తలను ఒకే పన్ను పరిధిలోకి తీసుకుని రావాలని విజ్ఞప్తి చేసింది. భార్యభర్తలను ఒఖ యూనిట్‌గా పరిగణించాలని సూచించింది.
దీనివల్ల పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు ఇద్దరి ఆదాయాన్ని సింగిల్ ట్యాక్స్ కింద పరిగణించవచ్చు. ప్రస్తుతం 7 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత ఆదాయం పన్ను నుండి మినహాయించిన విషయం తెలిసిందే. దంపతులకు కుటుంబానికి మినహాయింపు పరిమితి 14 లక్షల రూపాయలకు చేరుతుంది.
దంపతులు సంయుక్తంగా దాఖలు చేసే ప్రతిపాదిత పన్ను శ్లాబ్ వివరాలు- రూ.6 లక్షల వరకు పన్ను లేదు. రూ. 6-14 లక్షలు: 5 శాతం పన్ను, రూ. 14-20 లక్షలు: 10 శాతం పన్ను, రూ. 20-24 లక్షలు: 15 శాతం పన్ను, రూ. 24-30 లక్షలు: 20 శాతం పన్ను, రూ. 30 లక్షలు: 30 శాతం పన్ను అమలులో ఉంది.
జాయింట్ ఫైలింగ్ విధానంలో అదనపు మినహాయింపులు దంపతులకు లభిస్తాయి. జాయింట్ టాక్సేషన్ విధానం వల్ల పన్నుల శ్లాబులు, రేట్లు, తగ్గింపులు, మినహాయింపులు, సర్‌ఛార్జ్‌ల భారం తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. వచ్చే బడ్జెట్‌లో దీన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications