Union Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025.. ధరలు తగ్గేవి.. పెరిగేవి ఇవే..

Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ యువత, మహిళలపై దృష్టి సారించింది. ఆర్థిక మంత్రి ప్రసంగంలో ప్రధానంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి, రైతులకు ఒక ప్రత్యేక బహమతిని కూడా ఇచ్చింది. ఈ సారి బడ్జెట్లో ప్రభుత్వం ద్రవ్యోల్బణం, పన్నుల విషయంలో ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించింది.

బడ్జెట్ లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు అలాగే ఎగుమతి, దిగుమతులపై ట్యాక్సుల మార్పులు పలు వస్తువుల ధరలపై ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని వస్తువుల ధరలు పెరగడంతో పాటు.. మరికొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి. ఈ క్రమంలో ఏ వస్తువుల ధరలు పెరిగాయి.. వేటి ధరలు తగ్గాయనేది తెలుసుకుందాం.

Union Budget 2025 What gets Cheaper Costlier Full Details

వేటి ధరలు తగ్గుతాయి..

*తోలు, తోలు ఉత్పత్తులు భారీగా తగ్గుతాయి.ఎందుకంటే తోలు ఉత్పత్తులపై సుంకం తొలగించబడింది.
*ఎల్ఈడీ, ఎల్ సీడీ టీవీలు
*మొబైల్ ఫోన్లు
*వైద్య పరికరాలు
*మొబైల్స్, లిథియం బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాలు
*క్యాన్సర్ మందులు
* ప్రాణాలను రక్షించే మెడిసిన్స్
*ఫ్రోజెన్ చేపలు
*చేపల పేస్ట్
*క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్ లు
* 12 రకాల కీలకమైన ఖనిజాలు
*భారత్ లో తయారైన దుస్తులు

వేటి ధరలు పెరుగుతాయంటే..
*ఫ్లాట్ ప్యానెల డిస్ ప్లేల ధరలు పెరుగుతాయి.
*సిగరెట్ల ధరలు పెరుగుతాయి. పన్ను పెంపు కారణంగా ధరలు పెరగవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+