కేంద్ర బడ్జెట్ 2024: గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!
Budget 2024: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. ఇంకాసేపట్లో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవి. ఇదివరకు సార్వత్రిక ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్‌ను సభ ముందు ఉంచారు. ఇప్పుడు ఇది పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు.
ఈ నేపథ్యంలో ఈ ఉదయం నిర్మల సీతారామన్.. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మర్యాదపూరకంగా భేటీ అయ్యారు. ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి, ఇతర అధికారులు ఆ సమయంలో ఆమె వెంట ఉన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ హైలైట్స్‌ను రాష్ట్రపతికి అందజేశారు.

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చాక నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తంగా ఆమెకు ఇది ఏడవది. ఇప్పటి వరకు ఆరుసార్లు బడ్జెట్‌ను సభకు సమర్పించారు.
కాగా- నిర్మల సీతారామన్ సారథ్యంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం యధాతథంగా ఆమోదించింది. ఇందులో ఎలాంటి మార్పులకూ పూనుకోలేదు. లోక్‌సభకు సమర్పించడానికి కొద్దిసేపటి ముందు ప్రధాని నరేంద్ర మోదీ
సారథ్యంలోని కేంద్ర కేబినెట్.. దీనిపై ఆమోదముద్ర వేసింది.
ఈ బడ్జెట్‌పై దేశ ప్రజల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కొత్త ఆదాయపు పన్ను విధానం ద్వారా అదనపు మినహాయింపులు ఉండొచ్చు. ఆదాయపు పన్ను రాయితీ పెంపుదలపై కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత పెన్షన్ వ్యవస్థను కూడా పునరుద్ధరించే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications