అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన రద్దుకు సిఫార్సు

న్యూఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేయాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం సిఫార్సు చేసింది. ఇటీవల అరుణాచల్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలనను విధించిన సంగతి తెలిసిందే.

అరుణాచల్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై కేంద్రమంత్రిమండలి బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకుండా గవర్నర్‌ జ్యోతిప్రసాద్‌ రాజ్‌ఖోవాను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది.

 Union Cabinet recommends revocation of President's Rule in Arunachal Pradesh

అలాగే కాంగ్రెస్‌ నాయకుల అభ్యర్థనపై మధ్యంతర పిటిషన్‌ ఇచ్చేందుకు, పాత ప్రభుత్వాన్ని కొనసాగించాలన్న అభ్యర్థననూ తోసిపుచ్చింది.

సుప్రీంకోర్టు కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అడ్డుచెప్పకపోవడంతో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్‌ అసమ్మతి నేత కలిఖో పుల్‌ నేతృత్వంలోని 31మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ను ఇప్పటికే కలిశారు. రాష్ట్రపతి పాలన రద్దుకు కేంద్రం సిఫార్సు చేయడంతో త్వరలో అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+