Education:ఒకటవ తరగతిలో పిల్లలను చేర్చాలంటే కనీస వయస్సు ఎంతో తెలుసా..!

ఢిల్లీ: ఒకటవ తరగతి విద్యార్థులకు వయస్సు తప్పనిసరిగా ఆరేళ్లు ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఒకటవ తరగతిలో ప్రవేశం పొందేందుకు విద్యార్థులకు కనీస వయసును ఆరేళ్లుగా నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. నూతన జాతీయ విద్యా విధానం (National education policy) ప్రకారం తొలి ఐదేళ్లు విద్యార్థులకు నేర్చుకునే అవకాశం కల్పించాలని ఇందుకోసం గట్టి పునాది ఉండాలని అభిప్రాయపడింది. ఇందుకోసం తొలి మూడు సంవత్సరాలు ప్రీస్కూల్ విద్య, ఆ తరువాత ఒకటవ తరగతి రెండవ తరగతులు ఉంటాయని వెల్లడించింది.

ఈ కొత్త విధానం వల్ల పిల్లల్లో సొంతంగా నేర్చుకోవడం, చదువుకోవడం వంటివి అలవడుతాయని అదే సమయంలో పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారని కేంద్రం భావిస్తోంది. అంగన్‌వాడీలు లేదా ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, ప్రైవేట్ మరియు NGOలలో చదువుతున్న పిల్లలందరికీ మూడు సంవత్సరాల నాణ్యమైన ప్రీస్కూల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.

Union govt directs all state govts and UTs to have minimum six years of age for 1st class admission

ఇందుకోసమే ప్రీ స్కూళ్లను నడపాలంటూ విద్యాశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకటవ తరగతి ప్రవేశానికి కనీస వయస్సు ఆరేళ్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలని సూచనలు ఇచ్చింది.ప్రస్తుతం ఒకటవ తరగతి ప్రవేశం కోసం పిల్లలకు కనీస వయసు ఐదేళ్లుగా ఉంది. ఈ వయస్సును ఆరేళ్లకు పెంచాలనే అంశం గతంలో చర్చకు వచ్చింది. అయితే జాతీయ విద్యా విధానంను ఆయా రాష్ట్రాలు అమలు చేస్తే ఒకటవ తరగతి ప్రవేశంకు కనీస వయసు ఆరేళ్లు ఉండాలన్న నిబంధనను తీసుకురాగలమని గతంలో కేంద్రం వివరణ ఇచ్చింది. ఒకప్పుడున్న విద్యావిధానం 10+2 స్ట్రక్చర్‌గా ఉండేది. అయితే నూతన విద్యా విధానం ప్రకారం 5+3+3 స్ట్రక్చర్‌గా మారింది. ఇందులో 3 నుంచి 8 ఏళ్ల వయసున్న వారిని ఫౌండేషనల్ స్టేజ్ కింద విభజించడం జరిగింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి చర్చ లేదా ఆదేశాలు ఇవ్వలేదు.

ఇక బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటకలో మాత్రం గతేడాది జూన్ నుంచి ఒకటవ తరగతి ప్రవేశం కోసం పిల్లలకు కనీస వయస్సు ఆరేళ్లు ఉండాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు కనీస వయస్సు ఐదేళ్ల ఐదునెలలుగా ఉండేది. విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానంను అనుసరించి ఈ సవరణ చేసినట్లు కర్నాటక ప్రభుత్వం పేర్కొంది.

కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌లో ఒకటవ తరగతి ప్రవేశం కోసం కనీస వయస్సు ఆరేళ్లు ఉండాలంటూ గతేడాది నిబంధన తీసుకురావడంతో పిల్లల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటవ తరగతి ప్రవేశం కోసం కనీస వయసు ఐదేళ్లుగా ఉన్నింది. అయితే ఢిల్లీ హైకోర్టులో వీరికి చుక్కెదురైంది. చాలా తక్కువ వయసున్న పిల్లలను స్కూళ్లకు పంపరాదంటూ న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇలా చేస్తే పిల్లలపై ఒత్తిడి ఉంటుందని అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+