Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేడు అఖిలపక్ష సమావేశం, కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో, టెన్షన్ టెన్షన్!

న్యూఢిల్లీ/మణిపూర్: మణిపూర్‌లో పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో జరిగిన ఘర్షణల తర్వాత ఇదే తొలిసారి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు మణిపూర్‌లో మరో సారి శుక్రవారం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది.

హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని, సాధారణ స్థితిని పునరుద్ధరించే మార్గాలపై ఆలోచించడమే అఖిలపక్ష సమావేశం ఉద్దేశమని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. అంతకుముందు హింసాత్మక మణిపూర్‌కు చెందిన తొమ్మిది మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు, నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని నాయకులు ఆరోపించారు.

Union Home Minister Amit Shah has called an all-party meeting today at 3 pm on the violence in Manipur

ఐదు అంశాలతో కూడిన మెమోరాండంను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై, పరిపాలనపై తమకు నమ్మకం లేదన్నారు. చట్టపరంగా పరిపాలన అనుసరించడం ద్వారా సరైన పరిపాలన, ప్రభుత్వ పనితీరు కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందవచ్చు అని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించిన మెమోరాండంలో వివరించారు.

దీనిపై తొమ్మిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు కరమ్ శ్యామ్ సింగ్, తోక్‌చోమ్ రాధేశ్యామ్ సింగ్, నిషికాంత్ సింగ్ సపం, ఖ్వైరక్‌పం రఘుమణి సింగ్, ఎస్. బ్రోజెన్ సింగ్, టీ. రవీంద్రో సింగ్, ఎస్, రాజేన్ సింగ్, ఎస్. కేబీ దేవి, వై. రాధేశ్యామ్ సంతకాలు చేశారు. ఈ ఎమ్మెల్యేలంతా మైతి సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం.

షెడ్యూల్డ్ తెగ (ST) హోదాపై మైతీ, కుకీ వర్గాల మధ్య జరిగిన హింసలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే శుక్రవారం మధ్యాహ్నం అల్లకల్లోలంగా ఉన్న మణిపూర్‌లో భద్రతా బలగాలకు, సాయుధ దుండగులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ సంఘటన ఇంఫాల్ తూర్పు మరియు కాంగ్‌పోక్పి జిల్లాల మధ్య పర్వత ప్రాంతంలో జరిగిందని అధికారులు అంటున్నారు.

ఎదురు కాల్పుల్లో ప్రాణనష్టం జరిగిందా ?, లేదా ? అనేది ఇంత వరకు తెలియరాలేదు. దుండగులు యంగాంగ్‌పోక్పి నుండి కొండలపైకి చొరబడి ఉరంగ్‌పట్ మరియు గ్వాల్తాబి గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఆయుధాలతో కాల్పులు జరిపారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశం తరువాత మణిపూర్ విషయంలో కేంద్ర హోమ్ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని మణిపూర్ ప్రజలు టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+