ఒకే దెబ్బకు రెండు పిట్టలు, కార్యకర్తలకు డిమాండ్, ఒకేచోట అమిత్ షా, ప్రియాంక, దర్బార్ తో !
ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఓటర్లను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన జాతీయస్థాయి నాయకులు ఐటీ హబ్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రెండు పార్టీల కీలకనేతలు, ఒకే రోజు ఒకే నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం చెయ్యడంతో ప్రజలకు చుక్కలు కనపడుతున్నాయి.
ఐటీ హబ్ బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజక వర్గంలో ఇప్పుడు హైవోల్టేజీ వాతావరణం నెలకొంది. ఈ నియోజకవర్గంలో ఈసారి ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గంలో బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు.

ఇదే నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ, అమిత్ షా కూడా లోక్ సభ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బెంగళూరులోని పలు నియోజక వర్గాల ప్రజలను ఇదే ప్రాంతాలకు రప్పించి బెంగళూరులోని అన్ని లోక్ సభ నియోజక వర్గాల ఎన్నికల ప్రచారం చెయ్యడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల తేదీపై రాజకీయ పార్టీలు పంచుకున్న షెడ్యూల్ ప్రకారం ప్రియాంక గాంధీ వాద్రా చిత్రదుర్గ, బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో సమావేశాలు నిర్వహిస్తారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అదే నియోజకవర్గంలో ఎన్‌డీఏ అభ్యర్థులకు ఓట్లువెయ్యాలని ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు. చిత్రదుర్గ నియోజకవర్గంలో 73 ఏళ్ల బీజేపీ అభ్యర్థి గోవింద్ కారజోలాపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ 68 ఏళ్ల బీఎన్ చంద్రప్పను పోటీ చేస్తున్నారు. చంద్రప్ప గతంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు పార్లమెంట్ స్థానానికి పోటీ చేయనున్నారు.

జిల్లా కేంద్రమైన చిత్రదుర్గలోని ఓల్డ్ మిడిల్ స్కూల్ గ్రౌండ్‌లో బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తారని కాంగ్రెస్ కర్ణాటక విభాగం తెలిపింది. బీజేపీ యువజన విభాగం కర్ణాటక శాఖ అధ్యక్షుడు తేజస్వి సూర్యాకు గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, బెంగళూరులోని జయనగర మాజీ ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డికి మద్దతుగా సాయంత్రం బెంగళూరు సౌత్ నియోజకవర్గంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్లేగ్రౌండ్‌లో ప్రియాంక గాంధీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
సాయంత్రం 6 గంటలకు హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని మైదానంలో బహిరంగ సభ జరగనుంది. మరోవైపు అదే సమయంలో బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలోని స్వామి వివేకానంద సర్కిల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఇలా ఇద్దరు ఘటానుఘటు నేతలు ఎన్నికల ప్రచారంలో ఒకే లోక్ సభ నియోజక వర్గంలో తలపడనున్నారు. ఈసారి ఎలాగైనా సౌమ్యారెడ్డిని బెంగళూరు సౌత్‌లో గెలిపించాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
-
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications