వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా ప్రమాణం, ఇలా మోదీపై తిట్లు -కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై హ్యాకర్ల పిడుగు

|
Google Oneindia TeluguNews

''జ్యోతిరాదిత్య మాధవరావ్ సింధియా అనే నేను.. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణం చేస్తున్నా..'' అంటూ టీవీల నిండా వీడియోలు హోరెత్తిన సమయంలోనే.. ఆయన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో మాత్రం ఇదే మోదీని తూర్పారపడుతూ, బీజేపీని తిడుతోన్న వీడియో ఒకటి పోస్టయింది. కొద్ది నిమిషాల కలకలం తర్వాతగానీ కేంద్ర మంత్రి గారి ఫేస్ బుక్ ఖాతా హ్యాకైందని ఆయన సిబ్బంది గుర్తించలేకపోయారు..

పౌర విమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా బుధవారం సాయంత్రం ప్రమాణం చేసిన కొద్ది సేపటికే ఆయన అధికారిక ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. సింధియా ప్రమాణ స్వీకారం వీడియోలు హల్ చల్ చేస్తున్న సమయంలోనే హ్యాకర్లు ఉద్దేశపూర్వకంగా ఆయన ఖాతాలో ఓ పాత వీడియోను పోస్ట్ చేశారు. గతంలో కాంగ్రెస్ నేతగా అధికార బీజేపీని, ప్రధాని మోదీని సింధియా విమర్శించిన వీడియోను హ్యాకర్లు పోస్ట్ చేశారు.

union-minister-jyotiraditya-scindia-s-facebook-account-hacked-fir-filed-in-gwalior

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విటర్ లకు మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో హ్యాకర్ల చర్య మరింత కలకలం రేపింది. జ్యోతిరాదిత్య సింధియా ఫేస్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురైన ఘటనపై ఆయన సొంత ఊరు గ్వాలియర్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మధ్యప్రదేశ్ బీజేపీ, గ్వాలియర్ మాజీ ఎమ్మెల్యే రమేశ్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో గుర్తు తెలియని హ్యాకర్లపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Recommended Video

Modi Cabinet Expansion : New Cabinet Ministers | PM Modi Cabinet 2.0 | Oneindia Telugu

50 ఏళ్ల జ్యోతిరాదిత్య సింధియా సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ వాదిగా కొనసాగి, హైకమాండ్ తో విభేదాల కారణంగా తన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిపోయాడు. దాంతో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు కూలిపోయి, మళ్లీ బీజేపీ గద్దెనెక్కింది. అనంతరకాలంలో సింధియాను రాజ్యసభకు ఎంపిక చేసిన బీజేపీ.. తాజాగా కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. 30 ఏళ్ల కిందట మాధవరావు సింధియా నిర్వహించిన శాఖనే ఇప్పుడు జ్యోతిరాదిత్య చేపట్టడం గమనార్హం.

English summary
Union Civil Aviation Minister Jyotiraditya Scindia's Facebook account was reportedly hacked hours after he took oath as a cabinet minister in the Narendra Modi government.the hackers posted on old video of his where he was attacking the BJP and polices of the Modi. On Thursday, the Gwalior Police registered an FIR based on a complaint by former MLA Ramesh Agarwal. The police have filed a case against unknown people under the Information Technology Act and have started investigating the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X