మోదీ రెఢీ, కేంద్రంతో మాట్లాడండి, తప్పుడు మాటలు చెప్పే సీఎం మాట నమ్ముతారా ? !
రాళ్లు విసరడం మీ పని కాదు, వ్యవసాయం చేసి సాటి అన్నదాతలకు ఆదర్శంగా ఉండాలని రైతులకు కేంద్ర మంత్రి హితవుపలికారు. రైతులు చర్చలకు రావాలని, అనుమతి లేకుండా ఢిల్లీ వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని, నిరసనలను అణిచివేసే పనిలో కేంద్ర ప్రభుత్వం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.
రైతుల డిమాండ్లను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. కర్ణాటకలోని హుబ్బళిలో బుదవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విలేకరులతో మాట్లాడుతూ. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై రైతుల చేపట్టిన నిరసన సరికాదని, రైతు నాయకులతో కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి చర్చలు జరుపుతున్నారని అన్నారు. రైతుల కొత్త డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని, డిమాండ్లన్నింటినీ సామరస్యంగా పరిశీలిస్తున్నామని, రైతుల పట్ల మాకు సానుభూతి ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని, ఆయన పెద్ద అబద్ధాలకోరు అని, నేను ఆయన్ను తప్పుడు రామయ్య అని పిలుస్తున్నాని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యంగంగా అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను అధ్వాన్న స్థితికి తీసుకొచ్చిన సీఎం సిద్ధరామయ్య కేంద్రంపై వేలు ఎత్తి చూపిస్తున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇంతకు ముందు జాతీయ విపత్తు నిర్వహణ సహాయ నిధి కింద ఇంత మొత్తం ఎవ్వరూ ఇవ్వలేదని, మోదీ ప్రభుత్వం ఇచ్చిందని ప్రహ్లాద్ జోషి చెప్పారు. కర్ణాటక రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు ఇస్తున్నామని ప్రహ్లాద్ జోషి చెప్పారు. కరువు వచ్చినప్పుడు బీఎస్ యడ్యూరప్ప అదే డబ్బు పంచారని, అయితే ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చిన సిద్ధరామయ్య కేంద్రంపై వేలు చూపిస్తున్నారని, మేం ఒక్క రూపాయి కూడా జీఎస్టీ చెల్లించలేదని సిద్ధరామయ్య ఆరోపించడం సరికాదని ప్రహ్లాద్ జోషి అన్నారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌లో 12 వేల కోట్లు ఇచ్చామని. ఆయన కాలంలో డెవల్యూషన్ ఫండ్ 60 వేల కోట్లు ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. మా హయాంలో 2 లక్షల 36 వేల కోట్లు ఇచ్చామని, 10 ఏళ్లలో పన్నుల పంపిణీలో 81 వేల కోట్లు ఇచ్చామని, అయితే కర్ణాటకకు గ్రాంట్ ఇవ్వలేదని సీఎం సిద్దరామయ్య పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ప్రహ్లాద్ జోషి మండిపడ్డా. వడ్డీలేని రుణం ఇచ్చామని, 2004 నుంచి 2014 వరకు 1, 667 కోట్ల నిధులు విడుదలయ్యాయని, ఈ విషయాలు సీఎం సిద్దరామయ్యకు కనపడలేదా అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు.
మహదాయి అంశాన్ని అటవీశాఖ ఇంకా తిరస్కరించలేదని ప్రహ్లాద్ జోషి అన్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య చేస్తున్న ఆరోపణల్లో పసలేదని అన్నారు. నిధులు మంజూరుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆయన డ్యాష్‌బోర్డ్‌లో పెట్టామని, డౌన్‌లోడ్ చేసుకోవాలని బీజేపీ నేతలకు తాము సూచించామని, ఇప్పుడు ఆ డేటాను తొలగించారని సీఎం సిద్ధరామయ్యపై కేంద్ర మంత్రి జోషి తీవ్ర ఆరోపణ చేశారు.
ప్రస్తుతం కనీస మద్దతు ధర కోసం చట్టం రూపొందించడంతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఛలో ఢిల్లీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో నిరసనకు సిద్ధమైన రైతులను హరియాణ సరిహద్దులో, భోపాల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగి రాళ్లు రువ్వారు. ఛలో ఢిల్లీ నిర్వహించిన రైతులు సుమారు ఆరు నెలలకు సరిపడా సరుకులు తెచ్చుకున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది.
-
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
SPG కి షాక్ ఇచ్చిన ప్రధాని! ప్రోటోకాల్ బ్రేక్, మోదీ క్షమాపణలు -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..!












Click it and Unblock the Notifications