ఇళ్లకు పంపించాలని శ్రీనగర్ లో తెలుగు విద్యార్ధుల రిక్వెస్ట్.. స్పందించిన కేంద్రమంత్రి

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ వ్యవసాయ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (SKUAST)లో చదువుతున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో 300 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. సరిహద్దుల్లో గల బాంబుల శబ్దాలు, భద్రతా పరిస్థితులు వారిలో భయం రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో, తమను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ విద్యార్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు లేఖ రాశారు. వెంటనే స్పందించిన మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్, యూనివర్సిటీ డీన్‌లతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుకు చెందిన 23 మంది విద్యార్థులను బస్సుల్లో శ్రీనగర్ నుంచి ఢిల్లీకి తరలించారు. అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ చర్యలకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

union-minister-responds-to-telugu-students-request-in-srinagar-to-send-them-home

ఇక ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే.. మరోవైపు కవ్వింపు చర్యలకు దిగింది పాకిస్థాన్. కాల్పుల నిలుపుదలకు అంగీకరించిన కొద్ది గంటలకే పాక్ కుటిల బుద్ధిని ప్రదర్శించింది. జమ్మూ కశ్మీర్ లోని అనంతానాగ్, బుడ్గామ్, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో పాక్ డ్రోన్లను గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. అంతే కాకుండా శ్రీనగర్, జమ్మూ, ఉదంపూర్, RS పురా, అఖ్నూర్, చాంబ్, బింబర్ ప్రాంతాల్లో మోర్టార్ షెల్స్తో దాడులు చేస్తోంది.

ఈ క్రమంలోనే స్ట్రాంగ్ కౌంటరివ్వాలని భారత ప్రభుత్వం BSFకు పూర్తి అధికారాలిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీనగర్లో బ్లాకెట్ విధించారు. సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైందని J&K CM ఒమర్ ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా మారోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ సాయంత్రమే మిలిటరీ యాక్షన్, ఫైరింగ్ నిలిపివేతకు పాక్, భారత్ అంగీకరించిన విషయం తెలిసిందే. కానీ ఈ తరహ చర్యలకు పాకిస్థాన్ పాల్పడడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+