సొమ్మసిల్లి పడిపోయిన కేంద్రమంత్రి సదానందగౌడ
బెంగళూరు: కేంద్రమంత్రి, కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత సందానందగౌడ అస్వస్థతకు గురయ్యారు. శివమొగ్గలో ఆదివారం జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఆకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన్ని చిత్రదుర్గలోని బసవేశ్వర ఆస్పత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం బెంగళూరులోని ఓ ఆస్పత్రికి జీరో ట్రాఫిక్ మార్గంలో అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. చక్కెర స్థాయి పడిపోవడంతోనే కేంద్రమంత్రికి అలా జరిగిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

చికిత్స అనంతరం కుటుంబసభ్యులు, పార్టీ నాయకులతో ఆయన మాట్లాడారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, లంచ్ ఆలస్యం కావడంతోనే సదానందగౌడ షుగర్ లెవల్స్ పడిపోయాయని, ఆయన డయాబెటిక్ పేషెంట్ అని సన్నిహితులు తెలిపారు. గంటపాటు లంచ్ ఆలస్యం అయినందునే ఆయనకు షుగర్ లెవల్స్ పడిపోయాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు.
ನನ್ನ ಆರೋಗ್ಯ ಸುಸ್ಥಿರವಾಗಿದೆ. ಸಕ್ಕರೆ ಅಂಶ ಕಡಿಮೆಯಾಗಿ ಸ್ವಲ್ಪ ಸುಸ್ತಾಗಿತ್ತು. ಈಗ ಆರಾಮಾಗಿದ್ದೇನೆ. ಎಕೊ, ಇಸಿಜಿ ಸೇರಿದಂತೆ ಎಲ್ಲಾ ಪ್ಯಾರಾಮಿಟರ್ ಗಳು ಸಹಜವಾಗಿವೆ. ಸದೃಢ ಆರೋಗ್ಯಕ್ಕಾಗಿ ಶುಭ ಹಾರೈಸಿದ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. pic.twitter.com/7nJVdwY7K3
— Sadananda Gowda (@DVSadanandGowda) January 3, 2021












Click it and Unblock the Notifications