రుతుస్రావం సెల‌వుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ...

పీరియ‌డ్స్ సమయంలో మహిళా ఉద్యోగులకు పెయిడ్ లీడ్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. రుతుస్రావం అనేది వైక‌ల్యం కాద‌ని, మ‌హిళ జీవితంలో జ‌రిగే స‌హ‌జ ప్రక్రియ అని ఆమె అన్నారు. రాజ్య‌స‌భ‌లో ఆర్జేడి నేత మ‌నోజ్ కుమార్ వేసిన ప్ర‌శ్న‌కు ఆమె ఈ విధంగా స‌మాధానం చెప్పారు.

నెల‌స‌రి స‌మయంలో సెలవుల వల్ల పని ప్రదేశంలో మ‌హిళ‌లు వివ‌క్ష‌కు గురికావ‌చ్చ‌ని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. మ‌హిళ‌లు నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై కేంద్రం ఏదైనా విధానానికి రూపకల్పన చేస్తుందా? అని రాజ్యసభలో ఎంపీ మనోజ్‌ కుమార్ ఝా ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ ఈ విధంగా స్పందించారు.

Union Minister Smriti Iranis comments on menstrual holidays

'మహిళకు నెలసరి అనేది వైకల్యం కాదు. స్త్రీ జీవితంలో అదొక సహజ ప్రక్రియ.. ఈ సెలవుల వ‌ల్ల పని ప్రదేశంలో వారు వివక్షకు గురికావ‌చ్చు. రుతుక్రమం పట్ల ప్రత్యేక దృక్పథం ఉన్నందున మహిళలకు సమాన అవకాశాలు నిరాకరించిన సమస్యలను మనం ప్రతిపాదించకూడదు' అని ఆమె చెప్పారు. అలాగే మ‌హిళ‌ల పీరియ‌డ్స్ సమయంలో పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింద‌ని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించిందని ఆమె అన్నారు.

Union Minister Smriti Iranis comments on menstrual holidays

నెల‌స‌రి శుభ్ర‌త‌పై అవ‌గాహ‌న కల్పించేందుకు అనేక స్కీమ్‌లున్నాయి...

అలాగే, 10 నుంచి 19 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ అమ్మాయిల ఆరోగ్యం కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేక స్కీమ్‌ను అమ‌లు చేస్తోంద‌న్నారు. ఇక‌, ఈ వయసు అమ్మాయిల్లో వివిధ కార్యక్రమాల ద్వారా నెలసరి శుభ్రతపై అవగాహన కల్పించేందుకు 'ప్రమోషన్ ఆఫ్ మెన్‌స్ట్రువల్ హైజీన్‌ మేనేజ్‌మెంట్(ఎంహెచ్‌ఎం) స్కీమ్‌'‌ను ఇప్పటికే అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. పార్ల‌మెంట్‌లో గ‌త వారం పీరియ‌డ్స్ సెల‌వు అంశంపై ఓ నివేదికను సమర్పించారు. దీనిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమీక్షించాల్సి ఉంది. ఈ క్రమంలోనే కేంద్ర‌మంత్రి స్మృతీ ఇరానీ ఈ విధంగా స్పందించ‌డం జ‌రిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+