ఆ నియోజక వర్గంలో ఏం జరుగుతోంది, సీఎం vs కేంద్ర మంత్రి

కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అన్ని చోట్ల కచ్చితంగా గెలవాలని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూడా కచ్చితంగా కాంగ్రెస్ ను ఓడించాలని పక్కాప్లాన్ చేస్తుంది. సీఎం సిద్దరామయ్య కుటుంబం అవినీతికి పాల్పడిందని, ముడా స్కామ్ లో చిక్కుకున్నారని ఉప ఎన్నికలల జోరుగా ప్రచారం చేయడానికి బీజేపీ, జేడీఎస్ పార్టీలు సిద్ధం అవుతున్నాయి.

ఇప్పటికే కొందరు నామినేషన్లు కూడా వేశారు. నామినేషన్లు వేస్తున్న నాయకులు ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చెన్నపట్టణలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేసి ఎంపీ అయిన హెచ్ డీ కుమారస్వామి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. కుమారస్వామి రాజీనామాతో చెన్నపట్టణలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

Union minister trying to get his son to win the Chennapatna by-election

కేంద్ర మంత్రి హెచ్ డీ. కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి చెన్నపట్టణలో బీజేపీ-జేడీఎస్ పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి సీపీ యోగేశ్వర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. చెన్నపట్టణలో నిఖిల్ కుమార్ స్వామి, సీపీ యోగేశ్వర్ లో ఎవరు గెలుస్తారు అంటూ అప్పుడే బెట్టింగులు కూడా మొదలయ్యాయి. నిఖిల్ కుమారస్వామి వరుసగా రెండుసార్లు ఓడిపోయారు,

సీపీ యోగేశ్వర్ కూడా వరుపగా రెండుసార్లు ఓడిపోయారు. రెండుసార్లు వరుసగా ఓటమి చెందిన ఇద్దరు నాయకులు ఇప్పుడు చెన్నపట్టణ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇద్దరు నాయకులు కూడా ఎవరికి వారు గెలుపు మాదే అంటూ ధీమాగా చెబుతున్నారు. సీఎం సిద్దరామయ్యను టార్గెట్ చేసుకున్న బీజేపీ, జేడీఎస్ నాయకులు చెన్నపట్టణలో నిఖిల్ కుమారస్వామిని కచ్చితంగా గెలిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీపీ యోగేశ్వర్ ను కచ్చితంగా గెలిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. చెన్నపట్టణ నియోజకవర్గం నుండి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే మూడు రోజుల క్రితం సీన్ మొత్తం మారిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్ పై కుమారస్వామి మీద పోటీ చేసి ఓడిపోయిన సీపీ యోగేశ్వర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఆ పార్టీ అభ్యర్థిగా సీపీ యోగేశ్వర్ పేరు ప్రకటించారు. చెన్నపట్టణలో ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని జోరుగా చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+