"గిగ్" వర్కర్లకు కొత్త రూల్స్.. 16 ఏళ్లు నిండితేనే !!
కాలంతో పాటే ప్రజల జీవన శైలిలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు ఏదైనా కావాలంటే బయటికి వెళ్లి కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండే అన్నీ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే సదుపాయం ఉంది. కూరగాయలు నుంచి ఇంట్లో సరుకులు, బట్టలు, గృహోపకరణాలు ఇలా ఒక్కటి కాదు అన్నీ ఇంటి వద్దకే వచ్చేస్తున్నాయి. అందుకే పెరుగుతున్న ఆన్ లైన్ సంస్థలతో పాటు గిగ్ వర్కర్స్ కి కూడా డిమాండ్ పెరుగుతోంది. గిగ్ వర్కర్స్ అంటే శాశ్వత ఉద్యోగం కాకుండా కాంట్రాక్ట్ లేదా ఫ్రీలాన్స్ విధానంలో పనిచేసే కార్మికులు.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర కార్మికశాఖ కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ద్వారా కోట్లాది మంది డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్స్ కార్మికులు, కాంట్రాక్ట్ వర్కర్లకు భద్రతా పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

అర్హత వయసు, పని దినాల నిబంధనలు..
కేంద్ర కార్మికశాఖ మార్గదర్శకాల ప్రకారం 16 సంవత్సరాలు నిండిన వారే కేంద్ర పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అయితే నమోదు సమయంలో కార్మికుడి వయసు 60 ఏళ్లు దాటితే లేదా ఒక సంవత్సరంలో కనీసం 90 రోజులు పని చేయకపోతే ఆయా సామాజిక భద్రతా పథకాలు వర్తించవు. దీంతో నిజంగా పని చేస్తున్న కార్మికులకే ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రిజిస్ట్రేషన్ విధానం..
అలానే కార్మికులు సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఇందుకు ఆధార్, ఇతర గుర్తింపు పత్రాలు తప్పనిసరి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక మొబైల్ యాప్, వెబ్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. అంతే కాకుండా నమోదైన ప్రతి కార్మికుడికి కేంద్రం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కేటాయిస్తుంది. అదనంగా డిజిటల్ ఐడీ కార్డు కూడా జారీ చేస్తారు. దీని ద్వారా కార్మికుడి వివరాలు దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపుతో కొనసాగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని కార్మికుల రిజిస్ట్రేషన్‌ను పర్యవేక్షించి, పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
గిగ్ వర్కర్లకు ప్రత్యేక వెసులుబాట్లు..
ఇక గిగ్ కార్మికులకు ఈ మార్గదర్శకాలు మరింత అనుకూలంగా ఉన్నాయి. నెలలో ఒక్క రోజు పనిచేసినా వారు సామాజిక భద్రతా పథకాలకు అర్హులవుతారు. అగ్రిగేటర్ల ద్వారా వచ్చే ఆదాయం ఎంత అన్నది ఇక్కడ ప్రమాణంగా పరిగణించరు. అలాగే ఒకే రోజున వేర్వేరు అగ్రిగేటర్ల వద్ద పనిచేస్తే, ఆ రోజులను వేరువేరుగా లెక్కిస్తారు. ఉదాహరణకు ఒకే రోజు మూడు సంస్థల వద్ద పని చేస్తే అది మూడు పని దినాలుగా పరిగణనలోకి వస్తుంది. ఇది గిగ్ కార్మికులకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు.
అగ్రిగేటర్ల బాధ్యతలు..
మరోవైపు అగ్రిగేటర్లు (డెలివరీ, క్యాబ్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ సంస్థలు) ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ వద్ద పనిచేసే గిగ్ కార్మికుల వివరాలను తప్పనిసరిగా కేంద్ర పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలి. ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే, సంబంధిత కార్మికులు సంక్షేమ పథకాలకు అనర్హులయ్యే ప్రమాదం ఉంటుంది. సామాజిక భద్రతా నిధికి అవసరానికి మించి నిధులు జమ చేసిన అగ్రిగేటర్లు 90 రోజుల్లోగా రీఫండ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిబంధన ద్వారా సంస్థలపై అనవసర ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications