వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరం అరెస్ట్‌తో కేంద్రానికి ఏమిటి సంబంధం.. ఇంకా కిషన్ రెడ్డి ఏమన్నారంటే..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియల్ లీడర్ పి.చిదంబరం అరెస్ట్ ఎపిసోడ్ ఆ పార్టీశ్రేణుల్లో కలవరం రేపుతోంది. ఆయన అరెస్ట్ అనైతికమని వాదిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కక్ష సాధింపు ధోరణితో ఇలా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఆ క్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చిదంబరం అరెస్ట్‌తో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.

చిదంబరం అరెస్ట్ వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలను కిషన్ రెడ్డి ఖండించారు. కక్ష సాధింపుతోనే ఆయన్ని అరెస్ట్ చేయించిందనే వాదనలను తోసిపుచ్చారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందే తప్ప అందులో ఎవరి హస్తం ఉండదని వెల్లడించారు. ఆయన అరెస్ట్ పై స్పందించిన కిషన్ రెడ్డి మీడియా ఎదుట పలు అంశాలు ప్రస్తావించారు.

Union Mos Kishan reddy said that no role of government in p chidambaram arrest

అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారు చట్టాలకు అతీతులు కాదని.. అలాంటి వారికి ఏ శిక్ష విధించాలన్నా కూడా విచక్షణాధికారం న్యాయస్థానాలకే ఉంటుందని అభిప్రాయపడ్డారు. నిందితులు ఎవరైనా సరే చట్ట ప్రకారమే కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. అంతేగానీ బీజేపీ పాత్ర గానీ, కేంద్ర ప్రభుత్వం పాత్ర గానీ ఉండబోదని స్పష్టం చేశారు.

<strong>కరీంనగర్ రాజకీయం.. గంగుల బీజేపీలోకి.. ఆ ప్రచారంపై గరం గరం..!</strong>కరీంనగర్ రాజకీయం.. గంగుల బీజేపీలోకి.. ఆ ప్రచారంపై గరం గరం..!

బుధవారం రాత్రి సమయంలో అనూహ్యంగా చిదంబరంను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు దశలవారీగా విచారిస్తున్నారు. గురువారం నాడు రెండో దశ విచారణలో దాదాపు 20 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.

English summary
Union Minister of State for Home,G Kishan Reddy on P Chidambaram arrested by CBI. Law will take its own course, the court takes decisions as per law,the party,the govt has no role in it. It's the court, not government that decides where to put the people who indulge in corruption
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X