మోడీ సభకు వస్తే 50 మార్కులు..! యూనివర్సిటీ బంపర్ ఆఫర్..!
ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థల్ని తన నియంత్రణలో ఉంచుకుని దుర్వినియోగం చేస్తున్నారని, విపక్షాలకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పుతన్నారని.. ఇలా అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వీటిపై ఆయన ఎప్పుడూ స్పందించింది లేదు. అయితే ఇప్పుడు ఓ యూనివర్శిటీ ఏకంగా ప్రధాని మోడీ హాజరయ్యే ఓ సభకు వస్తే విద్యార్ధులకు 50 మార్కులు ఇస్తామని ఆఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరాఖండ్ లోని దేవ్ భూమి యూనివర్శిటీలో రేపు ఆదివారం ఓ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఆదివారం కావడంతో ప్రధాని మోడీ సభకు విద్యార్ధులు వస్తారో, రారో అని సదరు యూనివర్సిటీకి బెంగ పట్టుకున్నట్లుంది. దీంతో యూనివర్శిటీ అధికారులు ప్రధాని మోడీ సభకు హాజరైతే 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామంటూ ఆఫర్ చేశారు.

యూనివర్శిటీలో మిగతా కోర్సులు చదివే విద్యార్ధులు కూడా ఉన్నా బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం, బీసీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకే అధికారులు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రధాని మోడీతో వీరికి సంభాషించే అవకాశం కూడా ఉంటుందని అధికారులు తాజా నోటీసులో పేర్కొన్నారు. భారతీయ న్యాయ పరంపర (ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్) ప్రకారం ప్రధాని పాల్గొనే ఈవెంట్ ను కోర్సుగా పరిగణిస్తామని యూనివర్శిటీ తెలిపింది.

Dev Bhumi Uttarakhand University to award 50 marks for attending Modi’s rally! And how many for shouting Modi Modi? pic.twitter.com/9wiEKr2pCO
— Prashant Bhushan (@pbhushan1) November 8, 2025
కాబట్టి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కోర్సు అభ్యసించే విద్యార్ధులకు ప్రదాని మోడీ కార్యక్రమంలో పాల్గొనడం తప్పనిసరి చేస్తున్నట్లు యూనివర్శిటీ జారీ చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కార్యక్రమంలో వీరంతా తప్పనిసరిగా పాల్గొని 50 మార్కులు పొందక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. దీనిపై స్పందించిన సుప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ నోటీసును ఎక్స్ లో ట్వీట్ చేశారు. దీంతో పాటు ప్రధాని మోడీ సభకు హాజరై మోడీ.. మోడీ నినాదాలు చేస్తే ఎన్ని మార్కులు ఇస్తారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications